అమ్మాయిలు.. అబ్బాయిలు అనే తేడా లేకుండా.. వయసూ.. రిలేషన్ షిప్ అనే స్టేటస్ పట్టించుకోకుండా అందర్నీ ఒకే హౌస్లో ఉంచే బిగ్ బాస్.. వాళ్లు కంటెంట్ ఇవ్వడం కోసం చేసే ప్రయత్నాలను మనకు కట్లు లేకుండా మరీ చూపిస్తుంటారు. అందుకోసం కొందరు కంటెస్టెంట్స్… అమ్మాయిలతో పులిహోర కలిపే సీన్లను.. చాలా ప్రయారిటీగా.. ప్లే చేస్తుంటాడు. అంతేకాదు.. వీకెండ్ షోలో వచ్చిన నాగ్ కూడా.. ఈ పులిహోర రాజాల గురించి.. పులిహోర కలపడం గురించే మాట్లాడతాడు.. బిగ్ బాస్ హౌస్‌లో ఏదో కొత్త లవ్ స్టోరీ పుట్టినట్టు.. కన్వే చేస్తుంటాడు.
ఇక నాగార్జున మాటలను కాస్త సీరియస్గా తీసుకున్న కంటెస్టెంట్స్ వాళ్లది నిజమైన ప్రేమనో.. లేక షో కోసం చేసే యాక్టింగో తెలియక కాస్త మితిమీరి కపుల్ కంటెంట్ ఇస్తారు. తెలియకుండానే పాపులర్ అవుతుంటారు. అయితే ఇదే తంతు బిగ్ బాస్ సీజన్7 లోనూ కాస్త ముందుగానే మొదలైంది.
ఎపిసోడ్ బిగినింగ్‌లోనే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. రతికతో కాస్త గట్టిగానే పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. రతిక తన ప్రాపర్టీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రతిక పొట్టి బట్టలు వేసుకుంటే ఫీలయ్యాడు. వేరే వాళ్లతో మాట్లాడితే హర్ట్ అయ్యాడు. బిగ్ బాస్.. నాగార్జున కూడా ఎంకరేజ్ చేయడంతో.. రతికతో తన లవ్ ట్రాక్ ఓ రేంజ్‌లో నడిపిద్దామనుకున్నాడు. కానీ రైతు బిడ్డ లవ్ ట్రైన్ పట్టాలు తప్పడంతో.. సైలెంట్ అయిపోయాడు.
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తర్వాత… అతడి ప్లేస్‌ను రీ ప్లేస్ చేశాడు ప్రిన్స్ యావర్. ఇతను కూడా.. రతికనే లవ్ చేస్తూ… వెంట పడుతూ లవబుల్ కంటెంట్ ఇచ్చాడు. ఓకే ప్లేట్‌లో తినడాలు.. చేయి చేయి పట్టుకుని కబుర్లు చెప్పుకోడాల వరకు.. తన లవ్ జర్నీని తీసుకొచ్చాడు. కానీ ఉన్నట్టుండి రతిక ఎలిమినేట్ అవడంతో.. ప్రిన్స్ కూడా సైలెంట్ అయిపోయాడు.
వీళ్లిద్దరికి మధ్యలో.. డాక్టర్ బాబు గౌతమ్ కూడా.. సుబ్బుతో.. బానే పులిహోర కలిపాడు. సుబ్బు కూడా కోపరేట్ చేయడంతో.. మంచి జోడీగా కూడా.. బీబీ ఆడియెన్స్‌లో గుర్తింపు పొందారు. హౌస్ రొమాంటిక్ సీన్లను కూడా… రీక్రియేట్ చేశారు. కానీ సుబ్బు ఎలిమినేట్ అవడంతో.. గౌతమ్ సింగిల్ అయిపోయాడు.
ఇక వీళ్లందరికీ తోడు.. వైల్డ్ కార్డ్‌తో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన భోళె.. కూడా.. బిగ్ బాస్‌లో వీస్తున్న గాలితో.. మారిపోతున్నాడు. తనతో పాటు వచ్చిన సోషల్ మీడియా బ్యూటీ.. అశ్విని శ్రీ ని ఓ రేంజ్‌లో ఎత్తేస్తున్నాడు. లేటు వయసులో.. కళాత్మక మాటలతో.. కళాత్మక పులిహోర కలుపుతున్నాడు. ఇలా బిగ్ బాస్లో.. అందులోనూ.. సీజన్ 7లో కంటెస్టెంట్స్ కలిపే పులిహోరను చూసిన బీబీ ఆడియెన్స్ అండ్ నెటిజెన్స్ .. ఇచట పులిహోర గట్టిగానే కలపబడును అంటూ.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి