Bigg Boss 7 Telugu: అమర్‏దీప్ యాక్టింగ్ వేరేలెవల్.. వీడియో చూపించి మరీ పరువుతీసిన నాగ్..

|

Oct 08, 2023 | 6:41 AM

అమర్ దీప్, సందీప్ మాస్టర్ ఆట తీరును వాళ్లముందే బయటపెట్టాడు. టాస్కులలో వారిద్దరు ప్రదర్శించిన అతి తెలివి చేష్టలను వీడియోలుగా చూపించి మరీ ఉతికారేశారు. ముఖ్యంగా హద్దుమీరిన అమర్ దీప్ మాటలకు కంచె వేశారు. ఒక్కసారి కాదు.. రెండు మూడుసార్లు అమర్ దీప్ , సందీప్ ఇద్దరిని నిల్చొబెట్టి కడిగేశారు. వచ్చి రాగానే హౌస్ లో తొలి కెప్టెన్ అయిన ప్రశాంత్ ను అభినందించారు. రైతు బిడ్డ ఫస్ట్ కెప్టెన్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Bigg Boss 7 Telugu: అమర్‏దీప్ యాక్టింగ్ వేరేలెవల్.. వీడియో చూపించి మరీ పరువుతీసిన నాగ్..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‌బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్‏లో ఒక్కొక్కరిని ఉతికారేశారు నాగ్. ఒక్కో టాస్కులో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను వాళ్లతోనే బయటపెట్టించి మరీ క్లాస్ తీసుకున్నారు. ఇక టేస్టీ తేజ, యావర్ జంట చూడ ముచ్చటగా ఉందని.. ఇద్దరు కలిసి బాగా ఆడుతున్నారంటూ పొగిడేశాడు. అలాగే మొదటి కెప్టెన్ అయిన ప్రశాంత్ పై ప్రశంసలు కురిపించారు. అతని ఆట తీరు బాగుందంటూ కామెంట్స్ చేశారు. ఇక హౌస్ లో హీరోలుగా ఫీలవుతున్న అమర్ దీప్, సందీప్ మాస్టర్ ఆట తీరును వాళ్లముందే బయటపెట్టాడు. టాస్కులలో వారిద్దరు ప్రదర్శించిన అతి తెలివి చేష్టలను వీడియోలుగా చూపించి మరీ ఉతికారేశారు. ముఖ్యంగా హద్దుమీరిన అమర్ దీప్ మాటలకు కంచె వేశారు. ఒక్కసారి కాదు.. రెండు మూడుసార్లు అమర్ దీప్ , సందీప్ ఇద్దరిని నిల్చొబెట్టి కడిగేశారు. వచ్చి రాగానే హౌస్ లో తొలి కెప్టెన్ అయిన ప్రశాంత్ ను అభినందించారు. రైతు బిడ్డ ఫస్ట్ కెప్టెన్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే అదే సమయంలో చప్పట్లు కొడుతున్న అమర్ దీప్ కు కౌంటరిచ్చాడు.

ప్రశాంత్ గెలిచాడు కాబట్టే ప్రశాంత్ ను పొగిడాను అమర్.. ఊరికే ఏం కాదులే అంటూ సెటైర్ వేశాడు. ఆ తర్వాత అమర్ దీప్, సందీప్ ఇద్దరిని నిల్చొబెట్టి ఈ వారంలో మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి అంటూ అడిగారు. తమకు ఏమీ లేవు సార్ అంటూ చెప్పగా.. అవునులే మీకేముంటాయి. మీ వల్ల మిగిలిన వాళ్లకు అన్యాయం జరిగి ఉంటుంది అంటూ కౌంటరిచ్చాడు. స్మయిలింగ్ బోర్డులో ఛాలెంజ్ టాస్క్ కంప్లీట్ కాకుండా బెల్ కొట్టడం కరెక్టా.. తప్పా అని ప్రశ్నించారు. తప్పే అని అమర్ దీప్ ఒప్పుకోగా.. మరి ఆరోజు కంటెస్టెంట్స్ మీద ఎందుకు వాదించావ్ అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఆ తర్వాతి టాస్కులో అమర్ దీప్ సంచాలక్ గా వ్యహరించిన తీరుపై రియాక్ట్ అవుతూ తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్ మరోసారి కౌంటరిచ్చారు.

అమర్ దీప్ గాలితీసిన నాగ్..

ఆ తర్వాత అమర్ దీప్ ను మాత్రమే నిల్చొబెట్టి కడిగిపడేశారు. ప్రశాంత్ లుక్ చూసి దొంగ అని ఎలా అంటావ్ అని ప్రశ్నించారు. నేను అనలేదంటూ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు అమర్ దీప్. నేను అనలేదు.. ఎప్పుడు అన్నానంటూ అమాయకపు ముఖం పెట్టి తడబడుతుండగా.. మరో మాట లేకుండా వీడియో చూపించాడు నాగ్. అందులో ప్రశాంత్ రెడీ అవుతుండగా.. ప్రశాంత్ ఎలా ఉన్నా దొంగలాగే ఉంటాడని సందీప్ తో అన్నాడు అమర్ దీప్. దీంతో మరోసారి కవర్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. లుక్ వల్ల కాదు.. చేసే పని వల్లే దొంగ, దొర ఎవరో తెలుస్తుంది. ఇంటి సభ్యుల కోసం పెట్టిన స్ప్రైయిట్ బాటిల్స్ కొట్టేశారు మీరే దొంగ.. ఇంకొకరిని ఎలా అంటావ్ అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. మొత్తానికి ఈ వారం అమర్ దీప్, సందీప్ ఇద్దరి ఆట తీరుపై ఎక్కువగానే క్లాస్ తీసుకున్నారు నాగ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.