Bigg Boss 7 Telugu: రతికకు ఎలిమినేషన్ భయం.. ప్లీజ్ సార్ పంపించొద్దంటూ ఏడ్చేసింది..

కానీ ఉల్టా పుల్టా అంటూ తిరిగి హౌస్‏లోకి అడుగుపెట్టింది రతిక. ఇక బయట తన గురించి ఏం జరుగుతుంది అనేది చూసిన తర్వాత హౌస్ లో తన ఆట తీరు పూర్తిగా మార్చేసింది. వెళ్లినప్పటి నుంచి శివాజీ, యావర్ తో స్నేహం చేయడం తప్ప గేమ్ పై అంతగా ఫోకస్ పెట్టినట్లుగా అనిపించడం లేదు. ఇక ఇదే కారణాన్ని చెబుతూ గతవారం ఆమెను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ చూస్తే రతికకు ఎలిమినేషన్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: రతికకు ఎలిమినేషన్ భయం.. ప్లీజ్ సార్ పంపించొద్దంటూ ఏడ్చేసింది..
Rathika Rose

Updated on: Nov 06, 2023 | 7:21 AM

బిగ్‏బాస్ సీజన్ 7లోకి టైటిల్ విన్నర్ కావాలనే కోరికతో హౌస్‏లోకి అడుగుపెట్టింది రతిక. మొదటి వారం ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. కానీ ప్రశాంత్‏తో కావాలని స్నేహం చేయడం.. ఆ తర్వాత అతడికే వెన్నుపోటు పోడవడం.. తర్వాత యావర్‏తో ప్రేమపాఠాలు.. తిరిగి యావర్ అనర్హుడంటూ చెప్పడంతో ఆమెపె నెగిటివిటీ తారాస్థాయిలో చేరిపోయింది. తన ఆట తీరుతో అటు ఇంటి సభ్యులకే కాకుండా ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పించింది. దీంతో సోషల్ మీడియాలో రతిక పై దారుణంగా ట్రోలింగ్స్ నడిచాయి. రతికను ఎలాగైనా ఎలిమినేట్ కావాలంటూ నెట్టింట తెగ ట్రెండ్ చేశారు. అనుకున్నట్లే రతికను బయటకు పంపించేశారు. కానీ ఉల్టా పుల్టా అంటూ తిరిగి హౌస్‏లోకి అడుగుపెట్టింది రతిక. ఇక బయట తన గురించి ఏం జరుగుతుంది అనేది చూసిన తర్వాత హౌస్ లో తన ఆట తీరు పూర్తిగా మార్చేసింది. వెళ్లినప్పటి నుంచి శివాజీ, యావర్ తో స్నేహం చేయడం తప్ప గేమ్ పై అంతగా ఫోకస్ పెట్టినట్లుగా అనిపించడం లేదు. ఇక ఇదే కారణాన్ని చెబుతూ గతవారం ఆమెను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ చూస్తే రతికకు ఎలిమినేషన్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు తెలుస్తోంది.

నిన్నటి ఎపిసోడ్ లో మధ్య మధ్యలో కొంతమందిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున.. చివరకు యావర్, రతిక, తేజ ముగ్గురు డేంజర్ జోన్ లో మిగిలారు. దీంతో ఒక పుట్ట తెచ్చి అందులో ముగ్గురిని చేయి పెట్టాలని.. ఎవరి చేతికి పాము వస్తుందో వారు సేఫ్ అని.. ఎవరి చేతికి తాడు వస్తుందో వారు అన్ సేఫ్ అని చెప్పాడు నాగ్. ఇక ముందుగా రతికను పుట్టలో చేయి పెట్టాలని చెప్పాడు. దీంతో అప్పటికే రతిక గుండెల్లో గుబులు స్టార్ట్ అయ్యింది. పుట్టలో చేయి పెట్టేందుకు తెగ భయపడింది. అలాగే నిల్చోని ఉండిపోయింది. దీంతో ఏమైందమ్మా అని నాగ్ అడిగితే సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత పుట్టలో చేయి పెట్టగా తాడు రాగా.. అన్ సేఫ్ అని చెప్పాడు నాగ్. ఇక ఆ తర్వాత తేజ, యావర్ ఇద్దరిలో యావర్ కు పాము రాగా.. అతడు సేఫ్ అయినట్లు ప్రకటించాడు.

ఇక రతిక, తేజను గార్డెన్ ఏరియాలోనే ఉండాలని చెప్పాడు. ఇక ఆ తర్వాత రతిక మనసులో అసలైన భయం బయటకొచ్చేసింది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో నాగార్జున ప్రకటించకముందే రతిక ఏడుపు మొదలుపెట్టేసింది. సార్ ప్లీజ్ సర్.. పంపించొద్దు.. ఈ ఒక్కవారం ఉంచండి. ప్లీ్జ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అది నా చేతుల్లో లేదమ్మా.. ఇది ఆల్ రెడీ డిసైడ్ అయిపోయింది. నేను చెప్పడం మాత్రమే మిగిలుంది అంటూ చెబుతూ.. చివరకు ఎలిమినేట్ ఎవరు అయ్యారో అనౌన్స్ చేశారు నాగ్. ఇక తేజ ఎలిమినేట్ కావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇక నేను గేమ్ ఆడతాను.. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసింది. అంతకు ముందు నాలుగో వారంలో చివరి వరకు డేంజర్ లో తేజ, రతికనే ఉన్నారు. అప్పుడు తేజ సేఫ్ కాగా.. రతిక ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి చివరివరకు రతిక, తేజ డేంజర్ జోన్ లో ఉండడంతో రతికకు మరోసారి ఎలిమినేషన్ భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎలిమినేట్ భయంతో తెగ ఏడ్చేసిన రతిక.. ఈ వారం తన ఆట తీరు మార్చుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.