Bigg Boss 7 Telugu: చివరి నామినేషన్స్.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. నామినేషన్లో ఉన్నది ఎవరంటే..

|

Dec 05, 2023 | 7:33 AM

నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన కారణంగా అర్జున్ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు బిగ్‏బాస్. ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ముందుగా యావర్ వచ్చేసి ప్రియాంక, శోభాలను నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ చెప్పిన రీజన్ నచ్చలేదంటూ శోభాను నామినేట్ చేయగా.. సరే అనేసింది. ఇక ఆ తర్వాత బ్రెయిన్ వాడి ఆడటం ఎలా అనే బుక్ నాక్ ఇచ్చావ్ అది నచ్చలేదంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు.

Bigg Boss 7 Telugu: చివరి నామినేషన్స్.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. నామినేషన్లో ఉన్నది ఎవరంటే..
Bigg Boss Telugu
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో చివరి నామినేషన్స్ అయిపోయాయి. SPA , SPY బ్యాచ్ ల మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇక ఎప్పటిలాగే రెండు గ్రూపులు అపోజిట్ గ్రూపులోని మెంబర్లను నామినేట్ చేయగా.. ఈవారం తన స్నేహితుడు అమర్ దీప్ కు షాకిచ్చింది ప్రియాంక. ఇక అమర్, ప్రశాంత్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అలాగే అర్జున్, యావర్ మధ్య గొడవ జరగ్గా.. అనవసరంగా రెచ్చిపోయి అరుస్తూ నానా హంగామా సృష్టించింది శోభా. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన కారణంగా అర్జున్ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు బిగ్‏బాస్. ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ముందుగా యావర్ వచ్చేసి ప్రియాంక, శోభాలను నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ చెప్పిన రీజన్ నచ్చలేదంటూ శోభాను నామినేట్ చేయగా.. సరే అనేసింది. ఇక ఆ తర్వాత బ్రెయిన్ వాడి ఆడటం ఎలా అనే బుక్ నాక్ ఇచ్చావ్ అది నచ్చలేదంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. అలాగే ఇంట్లో పని తక్కువ చేస్తున్నానని చెప్పావ్ అని రీజన్ చెప్తే మధ్యలో దూరిపోయింది శోబా. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది.

ఇక తర్వాత శోభా.. యావర్, శివాజీని నామినేట్ చేసింది. అయితే సిల్లీ రీజన్లతో తనను నామినేట్ చేసిన శోభాకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చాడు శివాజీ. లాస్ట్ వీక్ గేమ్ సరిగ్గా అడలేదు … నాకు నచ్చలేదు అని శోభా చెప్పడంతో.. నేను ఆడలేదని నువ్వేలా చెబుతావ్ అంటూ క్వశ్చన్ చేశాడు శివాజీ. గతవారం అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు. మరీ అది రీజన్ అనిపించలేదా అంటే అనిపించలేదు అంటూ మాట దాటేసింది. దీంతో సహనం కోల్పోయిన శివాజీ.. నువ్వే్దో ఒలంపిక్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి నన్ను నామినేట్ చేసి ఉంటే తీసుకుంటాను అంటూ పాయింట్స్ టూ పాయింట్స్ మాట్లాడి శోభాకు కౌంటరిచ్చాడు.

ఇక ఆ తర్వాత ప్రశాంత్.. అమర్, శోభాకు వేశాడు. అయితే ఈ ముగ్గురి మధ్య చాలాసేపు వాదన జరిగింది. మోసపోయాను నీకు సపోర్ట్ ఉంటే.. నన్నే మోసం చేశావ్ అంటూ ప్రశాంత్ ఎమోషనల్ కాగా.. మధ్యలో పుల్లలు వేసింది శోభా. ఇక ఆ తర్వాత ఫౌల్ గేమ్ ఆడినందుకు అమర్ ను నామినేట్ చేశాడు అర్జున్ . ఆ తర్వాత యావర్ ను నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ తాళం చెవి పడేయడం వల్ల నేను నష్టపోయాను అని రీజన్ చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది.

ఇక గతవారం తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన అమర్ కు షాకిచ్చింది ప్రియాంక. ఫౌల్ గేమ్ ఆడినందుకు అతడిని నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత యావర్ ను నామినేట్ చేస్తూ.. ఒకప్పటి యావర్ కనిపించడం లేదంటూ నామినేట్ చేసింది. ఇక శోభా, ప్రియాంక ఇద్దరిని నామినేట్ చేశాడు శివాజీ. ప్రియాంక సేఫ్ గేమ్ ఆడుతున్నావని.. గౌతమ్ చేత అమర్ కు పాయింట్స్ ఇప్పించడం లేదంటూ ఫ్రెండ్షిప్ గురించి క్లా్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత శోభాను నామినేట్ చేశాడు. తర్వాత అమర్.. ప్రశాంత్, యావర్ ఇద్దరిని నామినేట్ చేశాడు.

ఈవారం నామినేట్ అయినవారు..
అమర్.. ప్రశాంత్, యావర్
ప్రియాంక.. అమర్, యావర్
శోభా.. యావర్, శివాజీ
యావర్.. శోభా, ప్రియాంక
ప్రశాంత్.. అమర్, శోభా శెట్టి
అర్జున్.. అమర్, యావర్