Bigg Boss 7 Telugu : అంతా అబద్దం.. ప్రోమోతో తప్పుదారి పట్టించిన బిగ్ బాస్..! అప్పుడే 50 రోజులు కంప్లీట్..

|

Oct 22, 2023 | 2:00 AM

ఉల్టా పుల్టా అనే థీమ్‌తో.. మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 నేటితో అంటే 49th ఎపిసోడ్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకో 50 రోజుల్లో పూర్తి కానుంది. అంటే బిగ్ బాస్ సీజన్‌ 7 ఇంకో 50 రోజుల్లో ముగియనుంది. ఇదే విషయం.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నోటి నుంచి వచ్చింది.దీంతో బిగ్ బాస్ 50 రోజులు అయిందన్న సంతోషం మధ్య.. ఇంకో 50 రోజుల్లో ముగియనుందనే ఆందోళన మధ్య.. లేదు మరో 50 రోజులు కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనవసరం లేదనే మాటల మధ్య..ఇవ్వాళ్టి సగం షో కంటిన్యూ అయింది.

Bigg Boss 7 Telugu : అంతా అబద్దం.. ప్రోమోతో తప్పుదారి పట్టించిన బిగ్ బాస్..! అప్పుడే 50 రోజులు కంప్లీట్..
Bigg Boss 7 telugu
Follow us on

ఎప్పటిలానే.. శనివారం షో మొదలెట్టిన కింగ్ నాగార్జున.. శుక్రవారం హౌస్‌లో జరిగిన విశేషాలేంటో చూపించారు. ఇక బిగ్ బాస్‌లో సందీప్‌, అర్జున్ మధ్య చివరి కెప్టెన్సీ టాస్క్‌ను ఈ ఎపిసోడ్‌లోనే కండక్ట్ చేస్తాడు బిగ్ బాస్. అందుకోసం ఇద్దరి మధ్య 6th సెన్స్‌కు సంబంధించిన ఓ టాస్క్‌ పెడతాడు. ఇద్దరి కళ్లకు గంతలు కట్టుకోమని చెప్పి.. ఎదురుగా ఉన్న బోర్డులో కెప్టెన్ అనే స్పెల్ వర్డ్స్‌ను ఫిల్ చేయాలని చెబుతాడు. తేజ సంచాలక్‌గా ఉన్న ఈ టాస్క్లో.. సందీప్‌ కంటే.. అర్జున్ తొందరగా ఈ టాస్క్‌ను ఫినిష్ చేసి విజయం సాధిస్తాడు. దీంతో బిగ్ బాస్.. ప్రిన్స్ యావర్‌ను తన దగ్గరున్న కెప్టెన్‌ బ్యాడ్జ్‌ను అర్జున్‌కు పెట్టమని ఆదేశిస్తాడు. ఇక నుంచి ఈ వారం హౌస్‌లో అర్జున్ కెప్టెన్‌గా కొనసాగుతాడని చెబుతాడు.

ఇక ఈ కెప్టెన్సీ టాస్క్‌ తర్వాత. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్‌ను కాస్త చిల్ చేస్తాడు బిగ్ బాస్. సాఫ్ట్ డ్రింక్స్‌ ‘స్ప్రైట్‌ తాగు చిల్ అవ్వు’ అనే టాస్క్‌లో భాగంగా.. ఓ కూల్ అండ్ క్రేజీ టాస్క్‌ ఇస్తాడు. హౌస్లో కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అర్జున్‌ను.. హౌస్లో ఉన్న సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్‌ చేసి.. వారిద్దరి మధ్య తాడు సాయంతో టగ్‌ ఆఫ్ వార్‌ పెట్టమని చెబుతాడు. వీరిద్దరిలో గెలిచిన టీమ్‌కు స్ప్రైట్ బహుమతిగా వస్తుందని చెబుతాడు. ఇక ఈ గేమ్‌లో గెలిచిన వారితో సంబంధం లేకుండా హౌస్‌లో ఉన్న అందరికీ స్ప్రైట్ ఇచ్చి చిల్ అవమని చెబుతాడు బిగ్ బాస్.

ఇక ఆ తరువాత సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కింగ్‌ నాగ్‌.. ప్రోమోలో చూపించినట్టు.. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు ఇచ్చిపడేయకుండా.. చాలా కూల్‌గానే మాట్లాడినట్టు కనిపిస్తారు. కానీ ఎపిసోడ్‌ చూశాక.. స్పైసీ కోసం.. క్యూరియాసిటీ కోసం ప్రోమోని.. బిగ్ బాసే అలా కట్ చేసినట్టు తెలుస్తుంది.

మొదట శోభను అడ్రస్ చేసిన నాగ్.. తనకు పంపిన కేక్‌ను ప్రొటెక్ట్ చేసుకోలేవా అంటూ.. క్లాస్ పీకినట్టు అనిపిస్తారు. అమర్‌ కేక్ తింటే మాత్రం..బిగ్ బాస్‌కు కంప్లైట్ చేయలేవా అంటూ.. సీరియస్గా మాట్లాడినట్టు చేస్తారు. తేజకు కూడా.. ఇదే విధంగా క్లాసు పీకుతారు నాగ్. అమర్‌ను పైకి లేపి.. స్ప్రైట్ విషయంలో.. కేక్ విషయంలో తుత్తరెందుకు అంటూ క్లాసు పీకుతారు. కానీ కట్ చేస్తే.. శోభ పేరుతో కేక్ పంపడం ప్రాంక్‌ అంటూ చెప్పి.. కేక్ తిన్న అమర్‌కు మరో స్పెషల్ కేక్ పంపిస్తారు. దానిపై వెల్ డన్ అమర్‌ అని ఉండడంతో.. అమర్‌ కాస్త మ్యాపీగా ఫీలవుతాడు. అంతేకాదు ఈ సారి.. కింగ్ నాగ్ అప్రిషియేషన్స్ పొందుతారు అమర్.

ఇక కేక ఎపిసోడ్ తర్వాత.. కాస్త సీరియస్‌ మూడ్‌లోకి వెళ్లిన నాగ్… నామినేషన్స్‌లో కుండ టాస్క్‌ను బిగ్ బాస్ స్టేజ్‌ పైన రీక్రియేట్ చేసి.. ఒక్కొక్కరి ఫోటో ఉన్న కుండను పగలగొడుతూ.. వాళ్ల తప్పొప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తారు నాగ్. ఎప్పటి లాగే.. ఒక్కొక్కరితో మాట్లాడుతూ.. వాళ్లను సరిచేసే ప్రయత్నం చేస్తారు.

ఇక ఈ క్రమంలోనే కింగ్ నాగ్ భోళె, శోభ, ప్రియాంక మధ్య జరిగిన గొడవను అడ్రెస్ చేసి సెటిల్ చేస్తారు. భోళె చేసిన తప్పును ఒప్పుకుని సారీ చెప్పడాన్ని అప్రిషియేట్ చేస్తారు. దాంతో పాటే భోళె చెప్పిన సారీని శోభ యాక్సెప్ట్ చేయకపోవడం.. అది తనిస్టమని.. చెబుతారు. తరువాత శోభ, భోళె మధ్య జరిగిన గొడవలో స్టాండ్ తీసుకున్న ప్రియాంకను కూడా నాగ్ అప్రిషియేట్ చేస్తారు. అశ్విని గేమ్ బాగా ఆడిందని.. సందీప్‌ కెప్టెన్సీ కంటెడర్స్‌ టాస్క్లో చీట్ చేయాలని చూసినా చేయకుండా ఉన్నాడని.. ఈ వారం జరిగిన విశేషాలను చెబుతారు కింగ్ నాగ్.

ఇక దీని తర్వాత.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఓ టాస్క్‌ పెడతాడు కింగ్ నాగ్. ఇప్పటి వరకు జరిగిన గేమ్‌లో ఎవరు లాడర్, ఎవరు స్నేక్ అంటూ.. ఒక్కొక్క సభ్యున్ని అడుగుతారు నాగ్. ఇక ఈ గేమ్‌లో.. ఎక్కువ మంది అర్జున్ అండ్ శివాజీని లాడర్ అంటూ ఎన్నుకుంటారు. ఇక స్నేక్‌గా ఎక్కువ మంద శివాజీని ఎన్నుకుంటారు. దీంతో శివాజీని హౌస్‌లో ఉన్న అందరితో సమానంగా ఉండు అంటూ సూచిస్తారు.

ఇక అంతకు ముందు మీకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్పడంటూ.. నాగ్ హౌస్లో ఉన్న సభ్యులను అడగగా.. అందుకు కెప్టెన్ అర్జున్ నిలుచుని.. అందరూ అనుకుంటున్న ఓ విషయాన్ని చెబుతా అంటూ.. కింగ్ నాగ్‌తో ఓ విషయం చెబుతాడు. శివాజీ ఆరోగ్యం బాలేదని.. ప్రతీ టాస్క్లోనూ.. తను సంచాలక్‌గా మాత్రమే పరిమితం అవుతున్నాడని.. తన విషయంలో బిగ్ బాస్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెబుతాడు. దీంతో కింగ్ నాగ్.. శివాజీని కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి ప్రైవేట్‌గా మాట్లాడతారు.

మానసికంగా తాను దృడవంతుడినే కానీ.. చేయి, భుజం సహకరించడం లేదని చెబుతాడు. అందుకు నాగార్జున్ ధృడంగా ఉండాలని చెబుతారు. తన కొడుకు కోసం గేమ్ ఆడాలని ఎంకరేజ్‌ చేస్తారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. తనను ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటారని చెబుతారు. అయితే శివాజీ తనకు ఫిజియో కావాలని చెబుతాడు. అందుకు కింగ్ నాగ్ ఓకే అని చెప్పి .. ఫిజియో చేపించే ఏర్పాట్లు చేస్తానంటారు. తనను మాత్రం గేమ్ పై ఫోకస్ పెట్టమంటారు.

 

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..