Bigg Boss 7 Telugu: భోలే ఎర్రగడ్డ అంటే భూమి తిరగబడ్డట్లు చేశావ్.. మరి యావర్‌ను అదే మాట ఎందుకన్నావ్..

కెప్టెన్సీ టాస్కులో మాత్రం శోభా సైకోయిజం పీక్స్ కు చేరిందనే చెప్పాలి. పిచ్చిపట్లుగా బిహేవ్ చేస్తూ నానా వీరంగం చేసింది. ముఖ్యంగా యావర్‏పై శోభా మాట్లాడిన మాటలు దారణమనే చెప్పాలి. కొడతావా కొట్టరా.. నువ్వు పిచ్చోడివి అంటూ అతడిని రెచ్చగొట్టింది. చివరకు బక్వాజ్ రీజన్ ఏంట్రా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. శోభా కన్నింగ్ గేమ్, సైకో గేమ్ చూసి ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ఆమె ప్రవర్తన చూసి బిగ్‏బాస్ త్వరగానే ఆమెను ఎలిమినేట్ చేయండంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Bigg Boss 7 Telugu: భోలే ఎర్రగడ్డ అంటే భూమి తిరగబడ్డట్లు చేశావ్.. మరి యావర్‌ను అదే మాట ఎందుకన్నావ్..
Shobha Shetty, Prince Yawar
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 28, 2023 | 7:53 AM

శోభా శెట్టి.. బిగ్‏బాస్ హౌస్ లో సైకోలా బిహేవ్ చేస్తుంది. నీకు ఎర్రగడ్డే దిక్కు అన్న ఒక్కమాటను పట్టుకుని భోలేను దారుణంగా అవమానించింది. అసలు అతను మనిషే కాదు అన్నట్లుగా ప్రవర్తించింది. ఇష్టమొచ్చినట్లు మాటల దాడి చేసింది. చివరకు నిన్న తనకు అవసరం వచ్చేసరికి భోలే అన్నా అంటూ పిలిచింది. కెప్టెన్సీ టాస్కులో నాకు సపోర్ట్ చేయాలన్నా అంటూ ప్రేమగా మాట్లాడింది. దీంతో శోభా డబుల్ యాంగిల్ చూసి అడియన్స్ సైతం అవాక్కయ్యేలా చేసింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్కులో మాత్రం శోభా సైకోయిజం పీక్స్ కు చేరిందనే చెప్పాలి. పిచ్చిపట్లుగా బిహేవ్ చేస్తూ నానా వీరంగం చేసింది. ముఖ్యంగా యావర్‏పై శోభా మాట్లాడిన మాటలు దారణమనే చెప్పాలి. కొడతావా కొట్టరా.. నువ్వు పిచ్చోడివి అంటూ అతడిని రెచ్చగొట్టింది. చివరకు బక్వాజ్ రీజన్ ఏంట్రా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. శోభా కన్నింగ్ గేమ్, సైకో గేమ్ చూసి ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ఆమె ప్రవర్తన చూసి బిగ్‏బాస్ త్వరగానే ఆమెను ఎలిమినేట్ చేయండంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిన్నటి కెప్టెన్సీ టాస్కులో బజర్ మోగగానే యావర్ వెళ్లి.. శోభా థర్డ్ గేమ్ లో విన్ అయ్యింది కాబట్టి ఆమె అనర్హురాలంటూ రీజన్ చెప్పాడు. ఇంకేముంది శోభా శెట్టికి మోనిత పూనింది. ఒరేయ్.. నెక్ట్స్ టైం నాకు ఛాన్స్ వస్తుంది. అప్పుడు వేస్తానురా.. నీలా బక్వాజ్ రీజన్ తో చేయను.. వెయ్ రా వెయ్.. నేనే కెప్టెన్ అవుతా.. నువ్వు చెప్తే నేను మారను. నేను ఇలాగే ఉంటా.. బరా బర్… నాలో టాలెంట్ ఉంది అందుకే ఇక్కడికి వచ్చా అంటూ తన నోటికి పని చెప్పింది. అప్పటికీ యావర్ ప్రశాంతంగానే ఉంటూ మరీ నేనేందుకు వచ్చాను అని రివర్స్ అడగ్గా.. రోటీలు తినడానికి వచ్చావ్.. తినడానికే వచ్చావ్ రా.. ఇంట్లో నువ్వు ఉంటావో.. నేను ఉంటానో చూస్తాను.. నువ్వు పిచ్చోడివి.. పిచ్చోడివి అంటూ యావర్ మీద మీదకు వెళ్లింది. దీంతో నన్ను పిచ్చోడు అంటావా అంటూ సీరియస్ అయ్యాడు యావర్.

అవును పిచ్చోడివి.. నువ్వు పిచ్చోడివే అంటూ అతడిని మరింత రెచ్చగొట్టింది. దీంతో యావర్ కూడా సీరియస్ కావడంతో.. రారా.. కొడతావా కొట్టు కొట్టు అంటూ అతడి మీద మీదకు వెళ్లింది. ఆమెను ఎంతమంది పట్టుకుని ఆపినా.. కావాలని మరీ యావర్ మీద మీదకు వెళ్తూ కొట్టరా ? అంటూ సైకోలా బిహేవ్ చేసింది. రోటీ తినడం వచ్చు.. రోటీ తినడం మాత్రమే వచ్చు అంటూ అతడి తిండిని అవమానించింది. నిన్ను ప్రతిసారి పిచ్చోడనే అంటానురా అంటూ పిచ్చిపట్టినట్లు చేసింది. నన్ను ఎర్రగడ్డ అంటాడా.. అంటూ ఓ పెద్ద కేకలు వేసింది. నా స్టేటస్, రెస్పెక్ట్ ఏమవుతాయంటూ తెగ హడావిడి చేసింది. ఇక్కడికి వచ్చి ఎవరెవరితో మాటలు పడాల్సి వస్తుందంటూ పెద్ద పత్తిత్తులా కంటతడి పెట్టింది. చివరికి యావర్‌ను అదే మాట అన్నది.. అది కూడా ప్లోలో కాదు.. పదే, పదే అన్నది. డిస్కషన్ అంతా అయ్యాక కూడా ఆ మాట అంటూ యావర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడింది అయితే కేవలం నీకు ఎర్రగడ్డ దిక్కు అన్నందుకే అటు భోలేపై సీరియస్ అయ్యాడు నాగార్జున. మరీ ఇప్పుడు పిచ్చోడు.. పిచ్చోడు అంటూనే అతడిని తిండిని హేళన చేస్తూ శాడిష్టులా బిహేవ్ చేసిన శోభాకు నాగార్జున ఎలాంటి గడ్డి పెడతాడో చూడాలి.

ఇక అంతా చేసి.. బిగ్‏బాస్ హౌస్ లో నానా వీరంగం సృష్టించి ఎప్పటిలాగే కన్నీల్లు పెట్టుకుంది. బక్వాజ్ రీజన్ ఏంట్రా అంటూ ఏడుపు మొదలు పెట్టింది. దీంతో తేజ ఆమెను ఓదార్చేశాడు. ఇక తర్వాత కూడా రండ్రా ఎవడు వేస్తాడో వేయండ్రా అంటూ రెచ్చిపోయింది. ఆ తర్వాత రతిక తోనూ గొడవ పెట్టుకుంది. దీంతో రతిక గట్టిగానే కౌంటరిచ్చింది.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?