Bigg Boss 5 Telugu Promo: ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన నాగార్జున.. ఫోటో చింపుతూ మరీ సన్నీకి క్లాస్.. ప్రోమో అదిరిపోలా..

|

Oct 30, 2021 | 1:34 PM

వారం మొత్తం ఇంటి సభ్యులు ప్రవర్తనకు అసలైన క్లాస్ పడేది శనివారమే. వీకెండ్ ఎపిసోడ్‏లో నాగార్జున రావడం.. సోమవారం నుంచి

Bigg Boss 5 Telugu Promo: ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన నాగార్జున.. ఫోటో చింపుతూ మరీ సన్నీకి క్లాస్.. ప్రోమో అదిరిపోలా..
Bigg Boss Promo
Follow us on

వారం మొత్తం ఇంటి సభ్యులు ప్రవర్తనకు అసలైన క్లాస్ పడేది శనివారమే. వీకెండ్ ఎపిసోడ్‏లో నాగార్జున రావడం.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంటి సభ్యుల ప్రవర్తనపై.. ఆట తీరుపై కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యాడు నాగ్. ఈ వారం కెప్టెన్సీ టాస్కులో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. శ్రీరామ చంద్ర, సన్నీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అలాగే యానీ మాస్టర్, సిరి మధ్య… జెస్సీ, సన్నీల మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే.

ఈసారి బిగ్‏బాస్ షోపై పాజిటివ్ ఒపెనియన్ ఆడియన్స్‏కు కలగడం లేదన్నది ముందు నుంచి వినిపిస్తున్న వాదన. హౌస్‏మేట్స్ ఆటతీరు ప్రేక్షకులకు ఏమాత్రం రుచించడం లేదు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 ఫెయిల్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రతి శనివారం నాగార్జున రావడం..ఇంటి సభ్యులకు క్లాస్ తీసుకోవడం.. గేమ్ ఎలా ఆడాలో సూచించడం కామన్‏గా మారిపోయింది. అయితే ఈ వారం ఇంట్లో మాములు రచ్చ జరగలేదు. ఈ క్రమంలోనే శనివారం విడుదలైన ఎపిసోడ్‏లో నాగార్జున ఫుల్ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరి ఫోటోను చింపేస్తూ మరీ క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఈరోజు సన్నీకి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్కులో సన్నీ శ్రుతి.. యానీ మాస్టర్ శ్రుతిమించి ప్రవర్తించడంతో నాగ్ వారిద్దరీ కడిగిపారేశారు.. సన్నీ ఫోటోను ఏకంగా నాగార్జున చింపేస్తూ మరీ ఫైర్ అయ్యారు. అలాగే గేమ్ తప్పుగా ఆడోద్దని.. గెలుపు కూడా పద్దతిగా గెలవాలని కాజల్‏ను హెచ్చరించాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే మాత్రం ఈరోజు ఇంట్లో ఒక్కొక్కరికి నాగ్ ఎక్కువగానే క్లాస్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ప్రోమో..

Also Read: Puneeth Raj Kumar Death: ఈరోజు సాయంత్రమే పునీత్ అంత్యక్రియలు.. ప్రకటించిన కర్ణాటక సీఎం..

Aryan Khan Released: ఎట్టకేలకు బయటకొచ్చిన ఆర్యన్ ఖాన్.. కొడుకు కోసం జైలుకొచ్చిన షారుఖ్..

Puneeth Raj Kumar: చిత్రపరిశ్రమలో తీరని విషాదం… సెట్స్ పైనున్న పునీత్ సినిమాలు ఇవే.