Bigg Boss 5 Telugu Elimination: ఈవారం ‏బిగ్‏బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది అతడే.. ఎవరంటే…

|

Oct 31, 2021 | 12:44 PM

‏బిగ్‏బాస్ ఎనిమిదవ వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఇప్పటివరకు సరయు, లహరి, ఉమా, నటరాజ్ మాస్టర్, హమిదా, ప్రియ,

Bigg Boss 5 Telugu Elimination: ఈవారం ‏బిగ్‏బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది అతడే.. ఎవరంటే...
Bigg Boss 5 Telugu
Follow us on

‏బిగ్‏బాస్ ఎనిమిదవ వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఇప్పటివరకు సరయు, లహరి, ఉమా, నటరాజ్ మాస్టర్, హమిదా, ప్రియ, శ్వేత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎనిమిదవ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రవి, షణ్ముఖ్, లోబో, సిరి, శ్రీరామ్, మానస్ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇక గత సీజన్స్ మాదిరిగానే ఎలిమినేషన్ ప్రాసెస్‏లో పస లేకుండా పోయింది. వారం వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ముందే తెలిసిపోతుంది. అయితే ఈసారి ‏బిగ్‏బాస్ సైతం.. ఇతర వెబ్ సైట్స్ పోలింగ్ రిజల్ట్స్.. నెటిజన్స్ కామెంట్స్ బాగా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇతర వెబ్ సైట్స్ నిర్వహించిన పోలింగ్ ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టె్ంట్లను ఏమాత్రం ఆలోచించకుండా బయటకు పంపిస్తున్నాడు. ఇక ఈవారం ఇంటి నుంచి నామినేట్ అయిన సభ్యులలో ఎప్పటిలాగే మాసన్, షణ్ముఖ్ సేవ్ జోన్ లో ఉన్నారు.

వీళ్లిద్దరికి నెట్టింట్లో ఓ రెంజ్‏లో ఫాలోయింగ్ ఉంది. ఇక వీరు ఎన్నిసార్లు నామినేట్ అయినా.. సేఫ్ జోన్ లో ఉండడం మాత్రం పక్కా.. ఇక మిగిలింది యాంకర్ రవి.. శ్రీరామచంద్ర, లోబో, సిరి వీరిలో యాంకర్ రవి ప్రవర్తన కారణంగా అతనికి రోజు రోజూకీ ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. అలాగే శ్రీరామ చంద్ర కూడా టాస్కులలోగానీ.. ఆట తీరులో కానీ పెద్దగా తేడా కనిపించకపోవడంతో శ్రీరామ్ ఓటింగ్ శాతం తగ్గితూ వస్తుంది. అయితే ఈవారం వీరిద్ధరు కాస్త లక్కీతో సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక మిగిలింది సిరి, లోబో..ఇందులో లోబో కంటే.. సిరికి కాస్త ఎక్కువే ఫాలోయింగ్ ఉంది. గేమ్ ముందు నుంచి సిరి ఫోకస్ ఆటపై సరిగ్గానే ఉంది.. అలాగే.. షన్నూతో మోజోరూంలో ముచ్చట్లు.. అలకలు.. హగ్గులు అంటూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. దీంతో కావాల్సినంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నాడు ‏బిగ్‏బాస్. ఇక లోబో.. మొదటి నుంచి రవి మాటలు వింటూ.. రవి ఏం చెప్తే అదే చేస్తా అన్నట్లుగా గేమ్ ఆడుతున్నాడు. అంతేకాకుండా.. టాస్కులలో లోబో అంతగా ఆడినట్టుగా ఇప్పటివరకు కనిపించలేదు. దీంతో లోబోకు ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. ఈ కారణంగానే ఈ సారి ఇంటి నుంచి లోబో ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ పలు పోలింగ్ లో లోబోకు తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో లోబోఈసారి ఇంటిని వీడడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: BalaKrishna: ఆహాలో బాలయ్య టాక్ ‏షో.. మొదటి గెస్ట్ ఎవరో చెప్పిన మేకర్స్.

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ ఆ కారణంగానే చనిపోయాడా ? .. అసలు విషయాలు చెప్పిన వైద్యులు..