బిగ్‌బాస్ రియాల్టీ షో అంటేనే వివాదాస్పదం. ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ రచ్చ కొనసాగుతూనే ఉంది. గ్రాండ్ ఫినాలే రోజు తమ అభిమాన కంటెస్టెంట్స్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. రన్నరప్ అయిన అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. అతడి సోదరుడిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడలోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారమవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్‌బాస్ రియాల్టీ షో.. స్నేహితులను చేస్తుంది.. ప్రేమికులను విడదీస్తుంది.. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ ఏకంగా ఓ జంట విడాకులు తీసుకునేందుకు కారణమవుతుంది. రెండేళ్లు వైవాహిక బంధంలో బిగ్‌బాస్ చిచ్చుపెట్టింది. దీంతో విడాకులు కావాలంటూ హౌస్‌లో పట్టుబట్టింది. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా.. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే.. విక్కీ జైన్.
అంకితా లోఖండే.. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన నటి. అదే సమయంలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం, బ్రేకప్ తో నిత్యం వార్తలలో నిలుస్తూండేది. అంకితా లోఖండే డిసెంబర్ 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇద్దరూ కలిసి బిగ్ బాస్ 17 హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తన భార్య అంకితా పట్ల విక్కీ చిన్నచూపు చూడడం.. ఇతర కంటెస్టెంట్స్ అందరి మధ్య తన భార్యను అవమానించడంపై విక్కీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన భర్త విక్కీని విడాకులు కావాలని కోరింది అంకితా.
నిన్ని ఎపిసోడ్లో కంటెస్టెంట్ అయేషా ఖాన్ మాట్లాడుతూ.. విక్కీ వైవాహిక జీవితం.. ప్రేమ, పెళ్లి గురించి చెప్పాలని కోరింది. దీంతో విక్కీ మాట్లాడుతూ వివాహితుడు ఎదుర్కొనే బాధల గురించి సరదాగా చెప్పాడు. దీంతో అంకితా బాధపడింది. వైవాహిక జీవితం ఎందుకు సరిగ్గా లేదని అంకితా తన భర్తను అడగ్గా.. పెళ్లి తర్వాత పురుషులు ఎన్ని బాధలు భరిస్తున్నారో.. ఎలా అనిపిస్తుందో ఎప్పుడూ బయటకు చెప్పలేరు అని అన్నాడు. దీంతో అంకితా అతడిని విడాకులు కోరింది. బిగ్ బాస్ షో అనంతరం తన భర్తతో కలిసి ఇంటికి వెళ్లాలని కోరుకోవడం లేదని.. తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది. దీంతో కంటెస్టెంట్స్, అడియన్స్ షాకయ్యారు. మొత్తానికి మరో జంటను విడిపోయేందుకు కారణమయ్యింది బిగ్ బాస్ రియాల్టీ షో అంటున్నారు ప్రేక్షకులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.