Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో సంచలన ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఉన్నది వీళ్లే.. ఆమె ఎలిమినేట్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది. గత వారం మిథిలేష్ క్యాష్ ఆఫర్‌తో వెళ్లిపోవడంతో ఎలిమినేషన్ జరగలేదు. కానీ ఈసారి నామినేషన్లలో ఉన్న 9 మందిలో కామనర్ కంటెస్టెంట్ ఓ కంటెస్టెంట్ తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారాంతానికి చేరుకోవడంతో ఎలిమినేషన్ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత వారం కంటెస్టెంట్ మిథిలేష్ రూ.15 లక్షల నగదు బహుమతి తీసుకుని స్వచ్ఛందంగా హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. అయితే ఈ వారం మాత్రం ఖచ్చితంగా ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నిలిచారు. త్రిగుణ్, రోహిత్ నాయుడు, ముఖేశ్, చరణ్, నరేశ్, షాలిని, దేబ్జానీ, అమన్ ,సృష్టి ఈ లిస్టులో ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
సోషల్ మీడియా ప్రచారాలు , అనధికారిక ఓటింగ్ ప్రకారం త్రిగుణ్, రోహిత్, అమన్ టాప్ ఓటింగ్‌తో సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కామనర్స్‌గా అడుగుపెట్టిన సృష్టి , చరణ్ ప్రస్తుతం ఓటింగ్‌లో చివరి స్థానాల్లో నిలిచి డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పటికే హౌస్‌లో ‘టోటల్ డామినేషన్’ థీమ్ నడుస్తుండటంతో, ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా ఇదే థీమ్‌ను జోడించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. చరణ్‌తో పోలిస్తే సృష్టి ఓటింగ్ చాలా తక్కువగా ఉండటంతో ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
అంతేకాకుండా, ఈ వారం కెప్టెన్సీ విషయంలోనూ తీవ్ర డ్రామా నెలకొంది. అమన్ కెప్టెన్సీ అధికారాన్ని సాధించినప్పటికీ, వర్షిణి తన ప్రత్యేక పవర్‌ను ఉపయోగించి కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి హౌస్‌లో సమీకరణాలను మార్చేసింది. ఈ క్రమంలో చరణ్, సృష్టిల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు లేదా చివరి నిమిషంలో బిగ్‌బాస్ ఏమైనా ఊహించని ట్విస్ట్ ఇస్తారా అనేది తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. అయితే ఈసారి మాత్రం సృష్టి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..
