Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ మరణం బాధాకరమన్న సోము వీర్రాజు.. డ్యాన్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ అంటూ సంతాపం తెలిపిన లోకేష్

Shiva Shankar Master: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్  డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ (72) కరోనాతో పోరాడి ఓడి .. మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. దీంతో చలన చిత్ర..

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ మరణం బాధాకరమన్న సోము వీర్రాజు..  డ్యాన్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ అంటూ సంతాపం తెలిపిన లోకేష్
Shiva Shankar Master

Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 6:03 PM

Shiva Shankar Master: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్  డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ (72) కరోనాతో పోరాడి ఓడి .. మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. దీంతో చలన చిత్ర పరిశ్రమలోని నటీనటులు, నిర్మాతలు, రాజకీయ నేతలు సహా పలువురు శివ శంకర్ మాస్టర్ మృతి సంతాపం తెలుపుతున్నారు.  తాజాగా ఏపి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సోషల్ మీడియా వేదికగా శివ శంకర్ మాస్టర్ కు నివాళులర్పించారు. తన సినీ కెరీర్ లో 800 కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మాస్టారు గారి మరణం చాలా బాధాకరమని అన్నారు. జాతీయ చలనచిత్ర అవార్డు పొందిన శివశంకర్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎన్నడూ గుర్తుంటాయని చెప్పారు. శివ శంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సోము వీర్రాజు చెప్పారు.

నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా శివ శంకర్ మాస్టర్ కు సంతాపం తెలిపారు. ప్ర‌ఖ్యాత నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతి విచార‌క‌రమని అన్నారు. ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో ఎన్నో చిత్రాల‌కు నృత్య‌రీతుల్ని స‌మ‌కూర్చి లెక్క‌లేన‌న్ని అవార్డులు సొంతం చేసుకుని, డ్యాన్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి మాస్ట‌ర్ మ‌ర‌ణం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటని లోకేష్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

శివశంకర్‌ మాస్టర్‌ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం హైదరాబాద్‌ పంచవటిలోని స్వగృహానికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే మరణించే ముందు శివ శంకర్ మాస్టర్ కు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు కరోనా తో శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్‌ శివశంకర్‌ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Also Read:

 డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ దేశాల నుంచి వస్తే టెస్టులు తప్పనిసరి..!