Viral Photo: బోసి నవ్వుల బుజ్జాయి.. ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. అందాల యాంకరమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే..

| Edited By: Janardhan Veluru

Mar 29, 2022 | 10:04 AM

పైన ఫోటోలో బోసి నవ్వులతో క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ

Viral Photo: బోసి నవ్వుల బుజ్జాయి.. ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. అందాల యాంకరమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే..
Viral
Follow us on

పైన ఫోటోలో బోసి నవ్వులతో క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తన వాక్చాతుర్యంతో అదరగొడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఆమె ఎవరో గుర్తుపట్టారా? సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్, అరుదైన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో బుల్లితెరపై దూసుకుపోతున్న ఈ అందాల యాంకరమ్మ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎవరో గుర్తుపట్టేయండి.

క్యూట్ క్యూట్ చూపులతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్. బుల్లితెరపై సత్తా తాటుతోన్న అందాల యాంకరమ్మ అనసూయ. ఓవైపు బుల్లితెరపై పలు షోలలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలతో ఆకట్టుకుంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోనూ దాక్షాయణి పాత్రలోనూ అదరగొట్టింది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా  తెలుస్తోంది. అలాగే కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ సినిమాలోనూ నటిస్తోంది.

Also Read: Penny Song: పెన్నీ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. సీతూపాప ఎంత ముద్దుగా చేసిందో..

Deepika Padukone: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రెటీలు, ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..

Rashmika Mandanna: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న శ్రీవల్లి.. రష్మిక వర్కవుట్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..