కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. కోవిడ్ కారణంగా థియేటర్లు కూడా ఓపెన్ కాకపోవడంతో.. దర్శక నిర్మాతలందరూ ఓటీటీ వేదికలగానే తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అందులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా వెబ్ సిరీస్‌లలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కూడా వెబ్ సిరీస్‌లకు డిమాండ్ బాగా పెరిగింది.
ఇప్పటికే అక్కినేని వారి కోడలు సమంత కూడా ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’లో నటిస్తున్నారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో యాక్టర్ వెబ్ సిరీస్‌లోకి అడుగెడుతున్నాడట. ఇప్పటికో ఎన్నో రోజులుగా యంగ్ హీరో అఖిల్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ బన్నీ వాసు, వాసూ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. అఖిల్ ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఓ క్రేజీ హిందీ వెబ్ సిరీస్‌లోని కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ సిరీస్‌లో రాక్ స్టార్ పాత్రను ఆఫర్ చేశారట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Read More:
మొద్దు శ్రీను హంతకుడు అనారోగ్యంతో కాదు, కరోనాతోనే మృతి
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్! శాశ్వతంగా నోటిఫికేషన్లు మ్యూట్ చేసేలా..