నానితో జోడి కట్టనున్న అదితీరావ్?

ఈ సమ్మర్‌లో జెర్సీతో ఆడియెన్స్‌ను పలుకరించబోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌లీడర్‌’ని ఇటీవలే పట్టాలెక్కించాడు. కథల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరిస్తుంటాడు ఈ నేను లోకల్ అనే కుర్రాడు. తాజాగా నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ తర్వాత చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఖరారైంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. మల్టీస్టారర్‌ సినిమాగా రూపొందనున్న ఆ చిత్రంలో నాని సరసన అదితిరావు హైదరీ నటించబోతున్నట్టు సమాచారం. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’లో అదితినే కథానాయిక. […]

నానితో జోడి కట్టనున్న అదితీరావ్?

Updated on: Mar 13, 2019 | 7:14 AM

ఈ సమ్మర్‌లో జెర్సీతో ఆడియెన్స్‌ను పలుకరించబోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌లీడర్‌’ని ఇటీవలే పట్టాలెక్కించాడు. కథల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరిస్తుంటాడు ఈ నేను లోకల్ అనే కుర్రాడు. తాజాగా నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ తర్వాత చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఖరారైంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. మల్టీస్టారర్‌ సినిమాగా రూపొందనున్న ఆ చిత్రంలో నాని సరసన అదితిరావు హైదరీ నటించబోతున్నట్టు సమాచారం. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’లో అదితినే కథానాయిక. అందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని మెప్పించింది. అందుకే మరోమారు ఆమెనే ఎంపిక చేసినట్టు తెలిసింది. మరి నాని-అతిధిల ప్రెస్ కాంబినేషన్ ఆడియెన్స్‌ను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.