సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కోన్న వేధింపుల గురించి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎంతో మంది బయటపెట్టిన సంగతి తెలిసిందే. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఇప్పటివరకు ఎంతోమంది నటీమణులు చెప్పారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల ఇండస్ట్రీలలో మహిళలు వేధింపులను ఎదుర్కోన్నారు. తాజాగా తనకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు సంఘటనల గురించి బయటపెట్టారు బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.
హిందీలో జరిగిన బిగ్ బాస్ ఓటీటీలో పాల్గోన్న కంటెస్టెంట్లలో ఉర్పీ జావెద్ ఒకరు. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోలతో, వీడియోలను షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఉర్ఫీ జావేద్.. ఇండస్ట్రీలో తాను ఎదుర్కోన్న సంఘటనల గురించి చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల్లాగే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఒకతను నన్ను బలవంతం చేశాడు. కానీ అదృష్టం కొద్ది బయటపడ్డాను. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా పేరున్న వ్యక్తుల నుంచే నేను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోన్నాను. వాళ్లు తలుచుకుంటే ఎవరినైనా, ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించే శక్తి ఉంది. అందుకే నేను వాళ్ల పేర్లు బయట పెట్టడం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావేద్.
ఉర్ఫీ జావేద్ ముందుగా బాదే భయ్యాకీ దుల్మనియా సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మేరీ దుర్గాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు
Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..