Payal Sarkar: డైరెక్టర్ పేరుతో ఆకతాయిల వేధింపులు.. సైబర్ క్రైమ్‏కు ఫిర్యాదు చేసిన హీరోయిన్..

చిత్రపరిశ్రమలో ఉన్న మహిళలకు అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంటారు కొందరు ఆకతాయిలు.. వారి సోషల్ మీడియాలో అకౌంట్లలో అసభ్యంగా కామెంట్స్ చేయడం

Payal Sarkar: డైరెక్టర్ పేరుతో ఆకతాయిల వేధింపులు.. సైబర్ క్రైమ్‏కు ఫిర్యాదు చేసిన హీరోయిన్..
Payal Sarkar

Updated on: Aug 31, 2021 | 12:52 PM

చిత్రపరిశ్రమలో ఉన్న మహిళలకు అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంటారు కొందరు ఆకతాయిలు.. వారి సోషల్ మీడియాలో అకౌంట్లలో అసభ్యంగా కామెంట్స్ చేయడం.. లేదా వారి అకౌంట్ హ్యాక్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇక పలువురు సినీ తారలను ట్రాప్ చేయడానికి నానారకాలుగా ప్రయత్నిస్తుంటారు. తాజాగా నటి పాయెల్ సర్కార్‏ తానను అవకాశాల పేరుతో ట్రాప్ చేసేందుకు ఓ డైరెక్టర్ ప్రయత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు ఫిల్మ్ మేకర్ రవి కినాగి అని చెప్పుకున్ ఫేస్‏బుక్ యూజర్ నుంచి అసభ్యకరమైన మెసేజ్‏లు రావడంతో షాకయ్యింది. నకిలీ ప్రొఫైల్ వెనుక ఓ అజ్ఞాత యూజర్ తనకు హీరోయిన్‏గా అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపించడాని గతంలో కోల్ కత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది పాయల్ సర్కార్. ఇక గత శనివారం రవి కినాగి నుంచి ఫేస్‏బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని.. రవి టాలీవుడ్‏లో ప్రసిద్ధ దర్శకుడు. అన్నదాత, ఛాంపియన్, ఐ లవ్ యూ స్టోరీ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. దీంతో పాయల్ అతడి రిక్వెస్ట్ ఓకే చేసింది.

అయితే తనకు ఇప్పటివరకు చాలా మంది దర్శకులు పాత్రలు అందిస్తూ.. సోషల్ మీడియా ద్వారా సందేశాలు ఇస్తుంటారని చెప్పుకొచ్చింది పాయల్. ఇక మెసెంజర్ లోని సంభాషణ అధికారికంగా మొదలు పెట్టాను. కానీ ఆఫర్ కావాలంటే రాజీపడగలరా? అని సదరు యూజర్ అడిగారట. అలాంటి అసభ్యకరమైన సందేశాన్ని చూసి తాను చలించిపోయానని తెలిపారు. దీంతో అతనితో మెసేజ్ చేయలేదని పాయల్ తెలిపింది. ఆ సందేశాలను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది పాయల్. నేను చాలా మంది దర్శకులతో మాట్లాడను. ఇలాంటి మోసాల గురించి విన్నాను. కానీ నేను ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి వారి భారిన పడుతున్న వారికి న్యాయం జరగాలి. లేకపోతే చాలా మంది నటీమణులు ఇబ్బందులు పడతారు. పరిశ్రమను దుర్వినియోగం చేస్తున్న ఆగతాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని పాయల్ పేర్కొన్నారు. పాయల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Gautham Ghattamaneni: పుత్రోత్సాహంతో పొంగి పోతున్న సూపర్‌ స్టార్‌.. నువ్వు ఎదగుతున్న తీరు చూడడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అంటూ.

Shilpa Shetty: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సాగర కన్య !… ఆ ట్వీట్‏కు అర్థం అదేనా ? బాలీవుడ్‏లో మరో చర్చ..