అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మహేశ్వరి. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మహేశ్వరి. ఈ మూవీ తర్వాత.. పెళ్లి, దెయ్యం, జాబిలమ్మ పెళ్లి వంటి హిట్ సినిమాలతో మహేశ్వరి అగ్రకథానాయికగా అప్పట్లో దూసుకుపోయింది. ముఖ్యంగా నవీన్ సరసన పెళ్లి సినిమా మ్యూజికల్ హిట్ అందుకుంది. ఈ మూవీలోని తన నటనకు ప్రశంసలు అందుకుంది మహేశ్వరి. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలం తర్వాత ఇటీవల మళ్లీ బుల్లితెరపై కనిపించి సందడి చేశారు మహేశ్వరీ. తాజాగా అలీతో సరదాగా షోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా.. తన కెరీర గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
మహేశ్వరి మాట్లాడుతూ.. గులాబీ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. ఆ సినిమాలో నా పాత్రకు నన్నే డబ్బింగ్ చెప్పమని కృష్ణవంశీగారు అన్నారు.. వర్మగారు కూడా అదే మాట చెప్పారు. షూటింగ్ సమయంలో నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. దీంతో నాకు చాలా పొగరు అనుకున్నారు. అలా కొంతమంది నా ముఖం ముందే చెప్పారు. నేనేదో రామ, కృష్ణ అని ఒక పక్కన కూర్చుంటే శ్రీదేవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా.. అందుకే అంత పొగరు అనుకున్నారు. కానీ నిజానికి అంత సీనే లేదు. గులాబీ సినిమాలో మేఘాలతో తేలిపొమ్మన్నది సాంగ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది. నాకు అసలే బైక్స్ పై వెళ్లడం అలవాటు లేదు. ఆ పాటలో ఎదురుగా ఒక మారుతి వ్యాన్ రావాలి. ఆ సమయంలో బైక్ స్కిడ్ అవడం.. లోయలో పడిపోవడం జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..