బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చేశారు. అనుకున్నవారితో పాటు కొందరు ఊహించని వ్యక్తులు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సిరి, సన్నీలు మొదటి, రెండో కంటెస్టెంట్లుగా ఇంట్లోకి అడుగు పెట్టేశాడు. హాట్ యాంకర్, నటి లహరి మూడో కంటెస్టెంట్‌గా వచ్చారు. నాల్గో ఇంటి సభ్యుడిగా ఎవరూ ఊహించని శ్రీరామ చంద్ర అడుపెట్టాడు. డ్యాన్స్ మాస్టర్ యానీ ఐదో కంటెస్టెంట్‌గా సూపర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆరో కంటెస్టెంట్‌గా లోబో, ఏడో కంటెస్టెంట్‌గా ప్రియ ఆగమనం పూర్తయ్యింది. ఎనిమిదో కంటెస్టెంట్‌గా మోడల్ జెస్సీ, తొమ్మిదో కంటెస్టెంట్‌గా ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఇంట్లో అడుగుపెట్టారు. ఇక పదో కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ కంప్లీట్ అయ్యింది. హీరోయిన్ హమీద 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. 12వ వ్యక్తిగా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పదమూడో కంటెస్టెంటుగా సరయు, పద్నాలుగో కంటెస్టెంట్‌గా విశ్వ , 15 వ కంటెస్టెంట్‌గా ఉమాదేవి, 16వ కంటెస్టెంట్‌గా మానస్, 17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్, 18వ కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మ, 19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చారు. పద్నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విశ్వ జర్నీ కాస్త ఎమోషనల్‌గా సాగింది. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన చెప్పారు. ఒకదాని వెంట ఒకటి కష్టాలు వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడినట్లు వెల్లడించారు. తమ్ముడి మరణాన్ని తలుచుకుని ఆయను ఎమోషనల్ అయ్యారు. ఆ ఘటనతో ఎంతో కుంగిపోయాను అని.. అయినా కూడా మళ్లీ తిరిగి నిలబడ్డాను.. ఒడిపోలేదు.. ఒడిపోయి వదల్లేదు అని విశ్వ భావోద్వేగానికి గురయ్యారు. యువ సీరియల్‌తో తన కెరీర్ నాగ్ చేతుల మీదుగా స్టార్ట్ అయ్యిందని చెప్పారు. నాగ చైతన్య జోష్ సినిమాలో కూడా తాను ఉండాలని నాగార్జున అన్నారంటూ నాటి సంగతులను విశ్వ గుర్తు చేసుకున్నారు.
Also Read: టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?