Bigg Boss 7: బిగ్‌బాస్‌ 7లోకి బుల్లితెర మెగాస్టార్‌! కుమారుడు చంద్రహాస్ కూడా! హంగామా మాములుగా ఉండదుగా..

బుల్లితెర ప్రేక్షకులకు బోలెడు వినోదాన్ని అందజేసే బిగ్‌ బాస్‌ మళ్లీ వస్తున్నాడు. సుమారు 3 నెలల పాటు సాగే ఈ రియాలిటీ షో కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సక్సెఫుల్‌గా ఆరు సీజన్లను కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ ఈసారి మరిన్ని హంగులతో మన ముందుకు రానున్నాడు.

Bigg Boss 7: బిగ్‌బాస్‌ 7లోకి బుల్లితెర మెగాస్టార్‌! కుమారుడు చంద్రహాస్ కూడా! హంగామా మాములుగా ఉండదుగా..
Prabhakar Son Chandrahas

Updated on: Jul 16, 2023 | 7:50 PM

బుల్లితెర ప్రేక్షకులకు బోలెడు వినోదాన్ని అందజేసే బిగ్‌ బాస్‌ మళ్లీ వస్తున్నాడు. సుమారు 3 నెలల పాటు సాగే ఈ రియాలిటీ షో కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సక్సెఫుల్‌గా ఆరు సీజన్లను కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ ఈసారి మరిన్ని హంగులతో మన ముందుకు రానున్నాడు. ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తాజా సీజన్‌కి సంబంధించి ఇటీవల స్టార్‌ మా బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుందంటూ టైటిల్ లాంచ్ చేసింది. ఇంకేముంది ఒక్కసారిగా బిగ్‌బాస్‌ 7 ట్రెండింగ్‌లోకి వచ్చింది. షో ఎప్పుడు స్టార్ట్‌ కానుంది? హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? అనే అంశాలపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎప్పటిలాగే బుల్లితెరకు చెందిన ఫేమస్‌ నటీనటులు బిగ్‌బాస్‌ 7 సీజన్‌లో సందడి చేయనున్నట్లు తెలిసింది. అయితే ఈసారి షోను మరింత ఆసక్తికరంగా రక్తికట్టించేందుకు ఒక ఇంట్రెస్టింగ్‌ కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు బుల్లితెర మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాకర్‌.

ఫేమస్‌ టీవీ షోస్‌, సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్నిచూరగొన్నారు ప్రభాకర్‌. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గానూ తన ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారు. అలాగే ఆపరేషన్‌ దుర్యోధన వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ టీవీ షోస్‌, సీరియల్స్‌లో సందడి చేస్తోన్న ప్రభాకర్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తే ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌మైన్మెంట్‌ గ్యారంటీ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభాకర్‌ రాకపోయినా అతని కుమారుడు చంద్రహాస్ వచ్చినా బుల్లితెర షోలో రచ్చ రచ్చే నంటున్నారు. కాగా ఇప్పటికే యాటిట్యూడ్‌ స్టార్‌గా నెట్టింట తెగ సందడి చేస్తున్నాడు చంద్రహాస్‌. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నాడు. సో.. ప్రభాకర్‌ లేదా చంద్రహాస్‌.. ఇద్దరిలో ఒకరైనా బిగ్‌బాస్‌లోకి వస్తే హంగామా మాములుగా ఉండదంటున్నారు ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us