Chandu Death: ‘పవిత్ర నన్ను పిలుస్తోంది’.. ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

త్రినయని నటి పవిత్ర జయరామ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు శుక్రవారం (మే17) ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలోలోని అతని నివాసంలోనే చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Chandu Death: పవిత్ర నన్ను పిలుస్తోంది.. త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
Pavithra Jayaram, Chandu

Updated on: May 17, 2024 | 11:04 PM

త్రినయని నటి పవిత్ర జయరామ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు శుక్రవారం (మే17) ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలోలోని అతని నివాసంలోనే చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చందు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆరేళ్లుగా చందు టీవీ నటి పవిత్ర జయరాంతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు  తెలుస్తోంది. త్వరలోనే ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంతలోనే పవిత్ర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే యాక్సిడెంట్ లో చందూ కూడా తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఆతర్వాత పలు సార్లు పవిత్రను గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యాడు. అయితే అతను ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

 

ఇవి కూడా చదవండి

 

కాగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ప్రాథమిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. అలాగేనటుడి ఆత్మహత్య కు గల కారణాల పై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం తదితర సీరియల్స్ లో నటిస్తున్నాడు చందు.

 

కాగా చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో పవిత్రకు సంబంధించి పోస్టులు షేర్ చేసినట్లు సమాచారం.

‘ఈ రోజు నా పవిత్ర పుట్టినరోజు ఆమె నన్ను పిలుస్తోంది’ అని పోస్ట్ షేర్ చేయడం, ఆ తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకే చందు ఇలా ప్రాణాలు తీసుకున్నాడని చాలామంది భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.