Sirivennela: తన మాటలతో జనాల మనసులను మాయచేసిన పాటల మాంత్రికుడు సిరివెన్నల సీతరామశాస్త్రి మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకున్న సీతరామశాస్త్రి మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతిసంస్కారాలు నిర్వహించే ముందు ఆయన పార్ధివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిమ్ నగర్‌లోని ఫిలిమ్ ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే సిరివెన్నెలను కడసారి చూసుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా ఫిలిమ్ నగర్ చేరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఫిలిమ్ చాంబర్ వచ్చారు. సిరివెన్నెల పార్ధివ దేహాన్ని సందర్శించుకున్న హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. పండితులను, పామరులను మెప్పించగలిగిన గొప్ప వ్యక్తిక్తం సిరివెన్నెల సొంతం. సినిమా రంగ పాటలైనా అశ్లీలత, దంద్వ అర్థాలకు తావు లేకుండా పాటలు రచించారు. తెలుగు సినిమా రంగంలో సీతరామ శాస్త్రి గారు తెలియని వారు ఉండరు. సినిమా పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తి అతను. ఆయన మరణం మనందరికీ ఎంతో దుఃఖాన్ని కలిగించింది. సీతరామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Sara Alikhan: అత్రంగి రేలో సారా అదిరిపోయే డ్యాన్స్.. యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రోమో..