మీడియాపై దాడి, హత్యాయత్నం కేసులో నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై ధర్మాసనం సోమవారం విచారించింది. మోహన్‌బాబు ఇండియాలోనే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు.. తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు. మోహన్‌బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరుపు లాయర్ వాదనలు వినిపించారు.. కాగా.. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ.. మోహన్‌బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని కోరారు. కాగా.. మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ స్టేట్‌మెంట్‌ను జీపీ కోర్టుకు సమర్పించారు.. వాదనల అనంతరం బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
జల్‌పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియాను తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో ఆవేశంగా వచ్చిన మోహన్‌బాబు..తన స్పందన తీసుకోవడానికి ప్రయత్నించిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్‌బాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మోహన్‌బాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మరోవైపు మోహన్‌బాబు, మనోజ్ వివాదంలో ఇప్పటికే పోలీసులు 3 FIRలు నమోదు చేశారు. ఇక జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశామని చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. తెలంగాణ డీజీపీ జితేందర్.
జల్‌పల్లిలో మీడియాపై దాడి, హత్యాయత్నం కేసులో మోహన్‌బాబు ఇప్పటికింకా ఎంక్వయిరీ ఫ్రేమ్‌లోకి రాలేదు. డిసెంబర్ 24వ తేదీ వరకు ఆయనకు టైముంది. ఈ క్రమంలోనే హైకోర్టు బెయిల్ పిటీషన్ ను కొట్టివేయడంతో మోహన్ బాబు బుధవారం పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి