Tannishtha Chatterjee: విభిన్న దర్శకుడు డైరెక్టర్ రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో ‘సైనైడ్’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియమణి, తనికెళ్లభరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే అంతర్జాతీయ నటి తనిష్టా ఛటర్జీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రదీప్, నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘తనిష్టా ఛటర్జీ రాకతో మా ‘సైనైడ్’ బృందం మరింత బలపడిందన్నారు.
ఆమె మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమా చిత్రీకరణ ఈ నెల 15న ప్రారంభం కాబోతుందని తెలిపారు. ప్రేమ పేరుతో 20 మంది అమ్మాయిలను నమ్మించి, శారీరకంగా వాడుకొని ‘సైనైడ్’ ఇచ్చి వాళ్ల బంగారు ఆభరణాలతో ఉడాయించే సైనైడ్ మోహన్ కేసు ప్రేరణతో ఈ కథ రూపొందించామని వెల్లడించారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ సంగీత దర్శకులు జార్జ్ జోసెఫ్ నేపథ్య సంగీతం, డాక్టర్ గోపాల శంకర్ స్వరాలు అందించనున్నారు.
Kuldeep Yadav: జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న టీం ఇండియా స్పిన్నర్ .. అవకాశం దక్కేనా!