ఓటీటీలో మూవీలు.. తమిళ సినీ డిస్ట్రిబ్యూషన్ కీలక నిర్ణయం

| Edited By:

Sep 03, 2020 | 5:07 PM

థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో ఓటీటీలో తమ సినిమాలు విడుదల చేసేందుకు కొంతమంది దర్శకనిర్మాతలు, హీరోలు ముందుకు వస్తున్నారు.

ఓటీటీలో మూవీలు.. తమిళ సినీ డిస్ట్రిబ్యూషన్ కీలక నిర్ణయం
Follow us on

Movies release OTT: థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో ఓటీటీలో తమ సినిమాలు విడుదల చేసేందుకు కొంతమంది దర్శకనిర్మాతలు, హీరోలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పలు చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల కాగా.. మరికొన్ని మూవీలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. కాగా ఓటీటీలో విడుదలపై కోలీవుడ్‌లో వివాదం నడుస్తోంది. ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసి మా పొట్ట కొట్టకండి అంటూ డిస్ట్రిబ్యూటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దర్శకనిర్మాతలు వారికి మద్దతును ఇస్తున్నారు. అయితే ఈ విషయంపై హీరోలు వెనక్కి తగ్గకపోవడంతో చెన్నై , చెంగల్పట్టు , కాంచీపురంకి చెందిన తమిళ సినీ డిస్ట్రిబ్యూషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

సినిమా నిర్మాణంలో ఉండగానే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కింద ఇచ్చిన అడ్వాన్స్‌ని ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తున్న నిర్మాతలు తక్షణమే చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అలా లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతామని వారు అంటున్నారు. ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంటుందని.. థియేటర్స్ , డిస్ట్రిబ్యూషన్ యాజమాన్యాలు రోడ్డున పడిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ  జీవితాలను నాశనం చేస్తున్నఓటీటీ.. పెద్ద హీరోల సినిమాలకు వరంగా, చిన్న సినిమాలకు శాపంగా మారుతుందని ఆరోపిస్తున్నారు. పెద్ద హీరోలు ఈ స్థాయికి రావడానికి డిస్ట్రిబ్యూటర్లు ఒక కారణమైనప్పుడు తమను రోడ్డున పడేసే ప్రయత్నాలను సమర్థించడం బాధాకరమని సినీ డిస్ట్రిబ్యూషన్ సంఘం అధ్యక్షుడు టి.రాజేందర్ అన్నారు.

Read More:

సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు.. ఇద్దరు మృతి

ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.. పట్టుబడితే శిక్షలివే