Breaking: ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.. పట్టుబడితే శిక్షలివే

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలపై నిషేధం విధించింది.

Breaking: ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.. పట్టుబడితే శిక్షలివే
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2020 | 3:16 PM

Online Rummy Game: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలపై నిషేధం విధించింది. అయితే వీటిని ప్రోత్సహిస్తూ ఎక్కడైనా నిర్వాహకులు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు విధించనుంది. అలాగే రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కాగా చిన్న పిల్లలు, యువత ఆన్‌లైన్‌లో రమ్మీకి ఎక్కువగా బానిస అవుతున్నారు. అంతేకాదు అందుకోసం భారీగా డబ్బులను వెచ్చిస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్‌ ఘటనలు జరుగుతున్నాయి. రమ్మీ పేరిట మోసాలు పెరుగుతున్నాయి. ఎంతోమంది బాధితులు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. దీంతో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆలోచించిన ఏపీ ప్రభుత్వం.. వీటిపై నిషేధం విధించింది.

Read More:

డ్రగ్స్ కేసు.. ప్రముఖ నటికి నోటీసులు

గండికోట జలాశయంలో పెరిగిన నీటిమట్టం.. కడప జిల్లాలో ఉద్రిక్తత