Tamil Actress Chandini: ఐదేళ్లుగా సహాజీవనం.. అవసరం తీరాక దూరం.. మాజీ మంత్రిపై వర్థనమాన నటి సంచలన ఆరోపణలు..!

|

May 29, 2021 | 8:10 AM

అన్నాడీఎంకే ముఖ్య నేత మాజీ మంత్రి మణికందన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వర్థమాన నటి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tamil Actress Chandini: ఐదేళ్లుగా సహాజీవనం.. అవసరం తీరాక దూరం.. మాజీ మంత్రిపై వర్థనమాన నటి సంచలన ఆరోపణలు..!
Tamil Actress Chandini Files Case Against Ex Minister Manikandan
Follow us on

Tamil Actress Chandini Files Case on Ex Minister: సినీ తారలకు, రాజకీయ నేతలకు సంబంధాలు ఉండటం అత్యంత సహజం. రాజకీయ నేతలు సినీతారలను పెళ్లాడటం, సినీ యాక్టర్లు పొలిటిషన్స్ పెళ్లాడటం సాధారణంగా మారాయి. అయితే, తాజాగా ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తనను మోసగించారనే విషయాన్ని సినీ నటి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేయడం దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది.

అన్నాడీఎంకే ముఖ్య నేత మాజీ మంత్రి మణికందన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వర్థమాన నటి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మాజీ మంత్రి మణికందన్… తనతో ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉందని, ఎంతో సన్నిహితంగా ఉన్నామని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మణికందన్ వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని పేర్కొంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నారని చాందిని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనను చంపేస్తానని మాజీ మంత్రి మణికందన్ బెదిరిస్తున్నారని, మణికందన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది నటి చాందిని. తనను బెదిరించినట్టుగా కొన్ని సాక్ష్యాలను పోలీసులకు అందించిందనే విషయం మీడియా కథనాల్లో స్పష్టమైంది.

మలేషియాలో జన్మించిన చాందిని.. సినిమాలపై మోజుతో చెన్నైలో అడుగుపెట్టారు. నాడోదిగల్ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తమిళ సినీ రంగంలో యువ హీరోయిన్ చాందినీ వర్థమాన తారగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకొంటున్నారు. ప్రస్తుతం పబ్జీ చిత్రంలో నటిస్తున్నారు. సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ యువ హీరోయిన్‌‌కు రాజకీయ నాయకుడితో పరిచయం ఏర్పడింది. తమిళనాడులోని ఏఐడీఎంకే ఎమ్మెల్యే, మంత్రి మణికందన్‌తో పరిచయం సహజీవనం వరకు వెళ్లింది. అయితే, పెళ్లి వరకు రాగానే చాందినిని మంత్రి దూరంగా పెట్టడంతో వారి బంధం బాహ్య ప్రపంచానికి తెలిసింది. మంత్రి మణికందన్ తనను మోసగించాడంటూ ఆరోపణలు చేయడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

మంత్రి మణికంఠ తనతో దిగిన చిత్రాలను నటి చాందిని బయట పెట్టింది. తన జీవితాన్ని నాశనం చేసిన మంత్రి మణికందన్‌ బెదిరింపులకు బయపడేది లేదు అంటూ ఘాటుగా హీరోయిన్ చాందిని సమాధానం ఇచ్చింది. వారిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసింది. అంతేకాకుండా తనకు న్యాయం జరిగేంత వరకు మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేసింది. అయితే, నటి చాందిని ఆరోపణలను కొట్టిపారేసిన మణికందన్.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న చాందినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మణికందన్ వెల్లడించారు.

ఇదిలావుంటే, మణికందన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీటీవీ దినకరన్ గ్రూపులో చేరిన రెబెల్‌గా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యతిరేక కూటమిలో చేరడం వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. కాగా, చాందిని ఫిర్యాదుతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also…  Sexual Harassment: కామర్స్ టీచర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు 500 మంది విద్యార్థినిలపై..