సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

| Edited By: Janardhan Veluru

Mar 22, 2021 | 3:48 PM

Theepetti Ganeshan RIP: తమిళ చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు పొందిన కమెడియన్ గణేశన్ మరణించాడు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..
Theepetti Ganesan
Follow us on

తమిళ చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు పొందిన కమెడియన్ గణేశన్ మరణించాడు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు శీను రామస్వామి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అనారోగ్యంతో నా సోదరుడు కార్తీ అకా తీపెట్టి గణేశన్.. మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మరణించాడు. నా సినిమాల్లో నటించిన ఉత్తమ నటులలో గణేశన్ ఒకరు. ఆయన మరణం ముందుగా నన్ను షాక్‏కు గురిచేసింది. ఆయనకు నా హృదయపూర్వక సంతాపం అంటూ శీను రామస్వామి అంటూ రాసుకోచ్చాడు. ఎన్నో సినిమాల్లో నటించిన గణేశన్.. తర్వాత క్రమంగా అవకాశాలను అందుకోలేకపోయాడు. దీంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కోన్నాడు. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. గతేడాది కరోనా ప్రభావంతో.. లాక్ డౌన్ ఏర్పడిన సమయంలో అతను తన పరిస్థితిని వివరిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశాడు. ప్రముఖ పాటల రచయిత స్నేహన్ అతనికి సహయం చేశాడు. 2019లో విడుదలైన శీను రామసామి తెరకెక్కించిన ‘కన్నే కలైమనే’ చిత్రంలో గణేశన్ చివరిసారిగా నటించాడు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Rang De PreRelease Event : ఈ సినిమా వల్ల మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము..

Nagababu: ‘సముద్రం’ సినిమాలో అందుకే నటించలేదు.. కానీ.. మెగా బ్రదర్ ఓపెన్ కామెంట్స్..