Tamannaah Corona positive: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వీరు, వారని తేడా లేకుండా అందరినీ ఈ వైరస్ సోకుతోంది. కొంతమందికి లక్షణాలతో ఈ వైరస్ నిర్ధారణ అవుతుండగా.. మరికొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇక సినిమా ఇండస్ట్రీలోనూ ఈ వైరస్ పలువురికి సోకగా.. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. హైఫీవర్‌తో బాధపడుతున్న తమన్నా ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. అయితే ఇన్‌ఫెక్షన్ ఎంత ఉందన్న విషయం ఇవాళ తెలియనున్నట్లు సమాచారం.
కాగా ఆ మధ్యన తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా.. వారిద్దరు కోలుకున్నారు. ఇక సినిమా షూటింగ్ కోసం మిల్కీబ్యూటీ ఇటీవల హైదరాబాద్ రాగా ఆమెకు వైరస్ నిర్ధారణ అయ్యింది. కాగా ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో పాటు ఓ వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇందులో సిటీమార్ చిత్రం నవంబర్ నుంచి పునః ప్రారంభం కావాల్సి ఉంది.
Read More: