మిల్కీ బ్యూటీ తమన్నా అంటే పడిచస్తారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే తన నటనతో,డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకోగలదు. తన అందచందాలతో యువతను హుషారెత్తించగలదు. ఇటు వెటరన్ హీరోలు, అటు యువ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తాజాగా అక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తూ ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా నిర్వహిస్తున్న ‘సామ్‌జామ్’ షో తాజా ఎపిసోడ్‌కు తమన్నా అతిథిగా హాజరై తన మనుసులోని మాటలను వెల్లడించింది. ఎక్స్‌పోజింగ్‌కు ఎటువంటి అభ్యంతరం చెప్పని ఈ భామ హీరోలతో కిస్ సీన్లకు మాత్రం దూరంగా ఉంటుంది. అయితే ఇదే విషయమై సమంత, మిల్కీని ఒక ప్రశ్న అడిగింది. ‘సినిమాల్లో ముద్దు సీన్లలో నటించనని రూల్ పెట్టుకున్నారు కదా.. ఒకవేళ దానిని బ్రేక్ చేయాల్సివస్తే ఎవరిని కిస్ చేస్తారు? అని సమంత అడిగిన ప్రశ్నకు.. తాను విజయ్‌దేవరకొండకు ముద్దిస్తానని సరదాగా సమాధానమిచ్చింది తమన్నా. ఈ మధ్యకాలంలో కవిత్వంపై దృష్టిపెట్టారని అడగ్గా.. ప్రేమ విఫలమైన దగ్గరి నుంచి కలం పట్టానని తమన్నా చమత్కరించింది.ఈ సందర్భంగా తన వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాయిష్టాలపై అనేక ఆసక్తికరమైన సంగతుల్ని పంచుకుంది తమన్నా.