Actress Taapsee Pannu: బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏ రేసులో తాప్సీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

|

Feb 01, 2021 | 5:41 PM

తెలుగులో 'ఝుమ్మంది నాదం' సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యింది తాప్సీ. అతి తక్కువ కాలంలోనే దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ.

Actress Taapsee Pannu: బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏ రేసులో తాప్సీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
Follow us on

తెలుగులో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యింది తాప్సీ. అతి తక్కువ కాలంలోనే దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు కెరీర్ కాస్తా వెనుకబడిపోయింది. తెలుగులో అవకాశాలు రాకా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది తాప్సి. ఇక అక్కడ వరుస ఆఫర్లను అందుకుంటే టాప్ హీరోయిన్ రేసులో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయంట.. తాజాగా మరో ఆఫర్ ఈ ముద్దుగుమ్మను వరించనున్నట్లుగా సమాచారం.

అసలు విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు బాలీవుడ్‏లో తాప్సీ నటించిన సినిమాలన్ని యంగ్ హీరోలతోనే చేసింది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ టాప్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట. అతనెవరో కాదండోయ్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలో తాప్సిని హీరోయిన్‏గా తీసుకోనున్నట్లుగా టాక్. ఇక షారుఖ్ ఖాన్ మూవీని రాజ్ కుమార్ డైరెక్టర్ చేయనున్నారట. అయితే ఈ సినిమా మొత్తం పంజాబ్ గ్రామం నేపథ్యంలో రాబోతుందని.. ఇందులో పంజాబ్ మాట్లాడే అమ్మాయి కోసం వెతుకుతున్నారని.. ఇందులో భాగంగా తాప్సీ ఎంపిక చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. తర్వలోనే ఇందుకు సంబంధించిన విషయాలపై అధికారిక ప్రకటన రానున్నాయి.

Also Read:

RRR Movie update : చివరిదశలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్.. భారీ ప్లాన్‌‌‌‌‌తో సిద్ధమవుతున్న దర్శకధీరుడు..