మా ఫలితాలు వచ్చాయటగా.. కంగనాకు తాప్సీ కౌంటర్‌

కంగనా రనౌత్‌, తాప్సీల మధ్య మాటల యుద్ధం కొత్తదేం కాదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు పలుమార్లు అవాక్కులు చవాక్కులు విసురుకున్నారు

మా ఫలితాలు వచ్చాయటగా.. కంగనాకు తాప్సీ కౌంటర్‌

Edited By:

Updated on: Jul 20, 2020 | 11:28 AM

కంగనా రనౌత్‌, తాప్సీల మధ్య మాటల యుద్ధం కొత్తదేం కాదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు పలుమార్లు అవాక్కులు చవాక్కులు విసురుకున్నారు. ఇక తాజాగా మరోసారి తాప్సీని గెలికారు కంగనా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో రాణిస్తున్న తాప్సీ, స్వర భాస్కర్‌లను బీ-గ్రేడ్ హీరోయిన్లు అంటూ కామెంట్లు చేసింది. అలియా భట్‌, అనన్య పాండే కంటే మంచి నటులైన తాప్సీ, స్వర భాస్కర్‌ ఎందుకు ఫేమస్ అవ్వలేకపోతున్నారని ఆమె ప్రశ్నించింది.

దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన తాప్సీ.. ”పది, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాల తరువాత మా ఫలితాలు కూడా వచ్చాయని విన్నాను. మా గ్రేడ్‌ సిస్టమ్‌ అధికారికమేనా..? ఇప్పటివరకు నెంబర్‌ సిస్టమ్‌ అనుకున్నానే..” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆ తరువాత ఓ వెబ్‌సైట్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ.. ”బయటి నుంచి వచ్చిన వారంటూ ఒకరు మమ్మల్ని వెక్కిరించడం నిజంగా బాధాకరం. ఇండస్ట్రీ మాకు చాలా ఇచ్చింది. ఇలాంటి మాటలతో సినిమా ఇండస్ట్రీలోకి తమ పిల్లల్ని పంపాలనుకునే వారు ఎలా భయపడతారు..? ఎలా ఆలోచిస్తారు..?” అని తెలిపారు. తాను చెడుగా ఉండాలనుకోవడం లేదని, ఒకరి మృతిని అనుకూలంగా మలుచుకునే ఆలోచన తనకు లేదని తాప్సీ చెప్పుకొచ్చారు.