సైరా విజయం.. మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన సురేందర్ రెడ్డి..!

| Edited By:

Oct 05, 2019 | 10:07 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. విడుదలైన అన్ని చోట్ల విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ మూవీ విజయంలో నటీనటులు, సాంకేతిక విభాగం, దర్శకత్వం, మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్క విభాగం పాత్ర చాలానే ఉంది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఆయన సున్నితంగా డీల్ […]

సైరా విజయం.. మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన సురేందర్ రెడ్డి..!
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. విడుదలైన అన్ని చోట్ల విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ మూవీ విజయంలో నటీనటులు, సాంకేతిక విభాగం, దర్శకత్వం, మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్క విభాగం పాత్ర చాలానే ఉంది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఆయన సున్నితంగా డీల్ చేసిన విధానం మూవీ చూసిన అందరిలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. అలాగే సైరా సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను ఎలా తెరకెక్కిస్తాడో అని అనుమానాలు వ్యక్తం చేసిన అందరూ.. ఆ తరువాత ఆయనపై అభినందనల వర్షం కురిపించారు. టాలీవుడ్ టాప్ డైరక్టర్లు, హీరోలు సైతం సురేందర్ రెడ్డి పనితీరుకు ముగ్ధులయ్యారు. కాగా ఈ సక్సెస్‌తో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారాడు సురేందర్ రెడ్డి.

కాగా ఈయన గతంలో అల్లు అర్జున్‌తో రేసు గుర్రం, రామ్ చరణ్‌తో ధృవ చిత్రాలను తెరకెక్కించాడు. రేసు గుర్రం సమయంలో ఆయన పనితీరును మెచ్చిన అల్లు అరవింద్.. చెర్రీతో తాను నిర్మించిన ధృవకు ఛాన్స్ ఇచ్చారు. ఇక ధృవ సినిమాను మెచ్చిన చిరు.. మరో ఆలోచన లేకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరాను సురేందర్ రెడ్డి చేతిలో పెట్టాడు. ఇక మెగాస్టార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా సురేందర్ రెడ్డి కూడా అద్భుతంగా సైరాను తెరకెక్కించాడు. ఇలా మెగా ఫ్యామిలీ హీరోలతో ఆయన తీసిన రేసు గుర్రం, ధృవ, సైరా మంచి విజయాలను సాధించాయి. దీంతో సురేందర్ రెడ్డి ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన డైరక్టర్ లిస్ట్‌లో చేరిపోయాడు. కాగా ఈ లిస్ట్‌లో ఒకప్పుడు వివి వినాయక్ కూడా ఉండేవారు. చిరంజీవి(ఠాగూర్, ఖైదీ నంబర్.150), అల్లు అర్జున్(బన్నీ, బద్రీనాథ్.. బన్నీ మంచి విజయం), చరణ్‌(నాయక్)లకు మంచి విజయాలను వినాయక్ ఇవ్వగా.. సాయి ధరమ్‌కు మాత్రం భారీ ఫ్లాప్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే.