Tillu Square: ‘రాధికా’ విషయంలో ఎందుకీ కన్ఫ్యూజన్‌ టిల్లు..? హీరోయిన్‌ కోసం వేట ఆగెదెప్పుడు.?

|

Dec 10, 2022 | 8:51 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయం దక్కించుకుంది. యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌తో పాటు సస్పెన్స్‌ కథాంశంతో వచ్చిన..

Tillu Square: రాధికా విషయంలో ఎందుకీ కన్ఫ్యూజన్‌ టిల్లు..? హీరోయిన్‌ కోసం వేట ఆగెదెప్పుడు.?
Tillu Square
Follow us on

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయం దక్కించుకుంది. యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌తో పాటు సస్పెన్స్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడింది చిత్ర యూనిట్‌. ‘టిల్లు స్వ్కేర్‌’ పేరుతో సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్‌ కొనసాగుతూనే ఉంది.

డీజీ టిల్లు సినిమా విజయంలో హీరోయిన్‌ పాత్ర కూడా కూడా కీలకమే విషం తెలిసిందే. రాధికా క్యారెక్టర్‌లో నేహా శెట్టి అద్భుతంగా నటించింది. అయితే సీక్వెల్‌లో మాత్రం నేహా స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవడానికి చిత్రయూనిట్‌ మొగ్గు చూపింది. ఇందులో భాగంగానే తొలుత శ్రీలీలను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది. అయితే అనుకోని కారణాల వల్ల శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అనంతరం ఈ చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులోనూ నిజం లేదని తర్వాత తేలింది. ఇక ఈ హీరోయిన్ల పేర్లు ఇక్కడితోనే ఆగిపోలేదు. మరో బ్యూటీ మడొన్నా సెబాస్టియన్‌ను టిల్లు సీక్వెల్‌లో తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

మడొన్నా దాదాపు కాన్ఫామ్‌ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో మడొన్నా కూడా ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టమైంది. ఇక తాజాగా మరో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల హిట్‌2లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి మీనాక్షి చౌదరిని టిల్లు సీక్వెల్ కోసం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మీనాక్షి కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో అయినా నిజం ఉందా లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే టిల్లు సీక్వెల్‌ హీరోయిన్‌కు సంబంధించిన చర్చ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. అసలు హీరోయిన్‌ విషయంలో ఈ సందిగ్ధత ఎందుకు నెలకొంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిఫికేషన్‌ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..