అఖిల్‌తో సైరా దర్శకుడు..!

| Edited By:

Jul 09, 2020 | 6:34 PM

మెగాస్టార్‌ చిరంజీవితో సైరాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు సురేందర్‌ రెడ్డి. కమర్షియల్‌గా ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించనప్పటికీ.. దర్శకుడిగా సురేందర్ రెడ్డికి మంచి మార్కులు పడ్డాయి.

అఖిల్‌తో సైరా దర్శకుడు..!
Follow us on

మెగాస్టార్‌ చిరంజీవితో సైరాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు సురేందర్‌ రెడ్డి. కమర్షియల్‌గా ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించనప్పటికీ.. దర్శకుడిగా సురేందర్ రెడ్డికి మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో ఈ మూవీ తరువాత ఈ దర్శకుడు బిజీ అవుతాడని అందరూ ఊహించారు. అయితే సైరా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నా.. తన తదుపరి సినిమాను ప్రకటించలేదు సురేందర్ రెడ్డి. ఆ మధ్యన మహేష్, ప్రభాస్‌ను ఒప్పించడానికి ఈ డైరెక్టర్ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాదు అల్లు అర్జున్‌, వరుణ్ తేజ్, రామ్ ఇలా పలువురి పేర్లు కూడా ఈ దర్శకుడి లిస్ట్‌లో వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్‌తో సురేందర్ రెడ్డి తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్ చిత్రంలో నటిస్తోన్న అఖిల్‌.. ఇంకా తదుపరి దర్శకుడిని ఫైనల్ చేయలేదు. ఇక ఇటీవల సురేందర్ రెడ్డి, అఖిల్‌కు ఓ కథ చెప్పారని.. అది అతడికి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరి కాంబోలో తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.