నా పక్కన కనిపించిన ప్రతి వ్యక్తితో నాకు లింక్ పెట్టారు

ఒకప్పుడు తరచుగా సినిమాల్లో కనిపించిన నటి సురేఖా వాణి.. ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. యంగ్ హీరోలకు తల్లి పాత్ర కోసం ఆమెను పలువురు దర్శకులు కలిసినప్పటికీ.

నా పక్కన కనిపించిన ప్రతి వ్యక్తితో నాకు లింక్ పెట్టారు

Edited By:

Updated on: Aug 18, 2020 | 12:43 PM

Surekha Vani on rumors: ఒకప్పుడు తరచుగా సినిమాల్లో కనిపించిన నటి సురేఖా వాణి.. ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. యంగ్ హీరోలకు తల్లి పాత్ర కోసం ఆమెను పలువురు దర్శకులు కలిసినప్పటికీ.. నో చెప్పారట. ఎందుకంటే తన పక్కన ఎవరు ఉన్నా తప్పుగా ప్రచారం జరుగుతోందట. ముఖ్యంగా గతేడాది తన భర్త మరణం తరువాత ఇలాంటివి మరింత ఎక్కువ అయ్యాయట. ఈ క్రమంలోనే సినిమాలకు ఆమె కాస్త దూరం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వార్తలన్నింటిపై తాజాగా సురేఖ స్పందించారు.

తన పక్కన కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తితో తనకు లింక్ పెట్టారని సురేఖా వాణి అన్నారు.  ”నా పక్కన ఒక పురుషుడు కనిపిస్తే చాలు కథలు అల్లేవారు. అక్కడున్నది కజిన్‌, బ్రదర్‌, తండ్రి ఎవరూ ఉన్నా తెలుసుకోకుండా మాట్లాడేవారు” అని సురేఖా పేర్కొన్నారు. వీటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనిపించిందని ఆమె తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సురేఖా.. తన కుమార్తె సుప్రితను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు ప్రయత్నాలను చేస్తున్నట్లు  వెల్లడించారు. కాగా సోషల్ మీడియాలో సుప్రిత తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే.

Read More:

ధోని పుట్టిన రోజే నా కంపెనీ పుట్టింది: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

కార్గిల్‌కి వెళ్లిన మొదటి మహిళా పైలట్‌ గుంజన్ కాదా..!