కార్గిల్‌కి వెళ్లిన మొదటి మహిళా పైలట్‌ గుంజన్ కాదా..!

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటించిన గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు భారత వైమానిక దళ

కార్గిల్‌కి వెళ్లిన మొదటి మహిళా పైలట్‌ గుంజన్ కాదా..!
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 11:59 AM

Gunjan Saxena Controversy: శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటించిన గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు భారత వైమానిక దళ అధికారులను తక్కువ చేసి చూపినట్లుగా ఉన్నాయని భారత వైమానిక అధికారులు సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ సైతం ఈ వివాదంపై స్పందించారు. గుంజన్ సక్సేనాలో పలు వాస్తవాలను తప్పుగా చూపించారని, మేకర్లు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ రేఖా శర్మ తెలిపారు. ఇక తాజాగా ఈ మూవీలో పలు అసత్యాలను చూపారంటూ గుంజన్ సక్సేనా సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఈ మూవీపై స్పందించిన లెఫ్టినెంట్‌ శ్రీవిద్యా రాజన్‌(రిటైర్డ్‌).. గుంజన్ కంటే ముందుగానే హెలికాఫ్టర్‌లలో తాను కార్గిల్‌కి వెళ్లాలని అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రాజన్‌.. సినిమాలో చాలా అసత్యాలు చూపారని వివర్శించారు. భారత వైమానిక దళంలో లింగ వివక్షత లేదని, ఎవరూ తమను తప్పుగా చూడలేదని ఆమె అన్నారు. మరోవైపు గుంజన్ సక్సేనా మాజీ సహోద్యోగి నమ్రిత చాందీ సైతం రాజన్‌కే మద్దతు పలికారు. గుంజన్‌ సక్సేనాలో భారత ఎయిర్‌ ఫోర్స్‌ని తక్కువ చేసి చూపారంటూ ఆమె ఓ లేఖ రాశారు. ఎంతో గొప్పదైన బ్లూ యూనిఫాంను ధర్మ ప్రొడక్షన్ దిగజార్చి చూపిందని మండిపడ్డారు. సినిమా కోసం కొన్ని కల్పితాలను జోడించుకుంటే తప్పు లేదని, కానీ అబద్ధాలను అమ్ముకోవడం దుర్భరమైన చర్య అని నమ్రిత ఆ లేఖలో పేర్కొన్నారు. చూస్తుంటే ఈ వివాదానికి ఇప్పట్లో తెర పడేలా లేదని తెలుస్తోంది.

Read More:

ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు అలర్ట్‌

ఈషా రెబ్బా ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్‌!

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు