గీతా భగత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ యాంకర్స్ ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.
ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ ఇలా మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ కి ఎక్కువగా ఆమే కనిపిస్తూ ఉంటారు.
గీతా భగత్ సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. మిడ్ రేంజ్ సినిమాల ఈవెంట్స్ అన్నిటికి దాదాపు ఈమే కనిపిస్తుంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ గీతా భగత్ ట్రోలింగ్ కి గురయ్యారు. తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్ర టీజర్ లాంచ్ జరిగింది.
భలే ఉన్నాడే చిత్ర కథ టీజర్ ని బట్టి ఇది మంచి రొమాంటిక్ సినిమా అని అర్ధం అవుతుంది. ఈవెంట్స్ కి ఆడవాళ్ళకి చీర కట్టుకోవడంలో సాయం చేసే వ్యక్తిగా రాజ్ తరుణ్ నటిస్తుంటాడు.
ఈవెంట్ లో డార్లింగ్ స్వామి మాట్లాడుతూ యాంకర్ గీతాని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇంత మాట్లాడుతున్నారు.. మీరెందుకు చీర కట్టుకుని రాలేదు అని అడిగారు.
దీనితో యాంకర్ గీతా బదులిస్తూ.. నాకు హీరో రాజ్ తరుణ్ చేత చీర కట్టించుకోవాలని ఉన్నట్లు గీతా భగత్ తన కోరిక బయట పెట్టింది. హీరో చేత చీర కట్టించుకోవడం ఏంటి అంటూ ట్రోలింగ్ షురూ చేశారు.