Eesha Rebba: ఈషా రెబ్బా ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్‌!

టాలీవుడ్‌ నటి ఈషా రెబ్బా ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ అయ్యింది. ఎవరో ఈ నటి అకౌంట్‌ని హ్యాక్ చేశారు. ప్రస్తుతం ఆమె అకౌంట్‌ మొత్తం ఖాళీ అయ్యింది.

Eesha Rebba: ఈషా రెబ్బా ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్‌!
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 10:09 AM

Eesha Rebba twitter: టాలీవుడ్‌ నటి ఈషా రెబ్బా ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ అయ్యింది. ఎవరో ఈ నటి అకౌంట్‌ని హ్యాక్ చేశారు. ప్రస్తుతం ఆమె అకౌంట్‌ మొత్తం ఖాళీ అయ్యింది. ఈ విషయాన్ని ఈషా ఇన్‌స్టాలో వెల్లడించింది. ”నా ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ అయ్యింది. దాన్ని ఓపెన్ చేస్తే మీ అకౌంట్‌ లేదు అని చూపిస్తోంది” అని ఈషా ఇన్‌స్టాలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె టెక్నికల్ టీమ్‌ దీన్ని పరిశీలిస్తున్నట్ల తెలుస్తోంది.

అయితే సెలబ్రిటీల సోషల్‌ మీడియాల అకౌంట్లు హ్యాక్ అవ్వడం కొత్తేం కాదు. టాలీవుడ్ మొదలు హాలీవుడ్‌ వరకు ఎంతోమంది అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. మొన్నటికి మొన్న సింగర్ స్మిత అకౌంట్‌ని హ్యాక్ చేసిన హ్యాకర్లు.. అందులో ఏకంగా నీలి చిత్రాలు పెట్టిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈషా పలు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోంది. హిందీలో మంచి విజయం సాధించిన లస్ట్ స్టోరీస్‌ తెలుగు రీమేక్‌లో ఈషా కనిపించనుంది. అందులో కియారా పోషించిన పాత్రలో ఈషా నటించినట్లు సమాచారం. అలాగే సంపత్‌ నంది అసిస్టెంట్‌ తెరకెక్కిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌లోనూ ఈషా కనిపించనుంది.

Read More:

రాముడిగా ప్రభాస్‌.. మరి ఆ నలుగురు ఎవరు..!

అమెరికా ప్లాన్‌లో మహేష్ బాబు‌!