
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు, వైవిధ్యమైన కథలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుంటారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతమైన ఫాంటసీ కామెడీ చిత్రంగా నిలిచిపోయింది. కమెడియన్ అలీని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేసింది. ఈ సినిమాలో కామెడీతో పాటు ఆ కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పాటలు సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్, సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. కానీ మీకు తెలుసా.. ఆ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఇంతకీ ఆ పాట మీకు గుర్తుందా? అయితే ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుందాం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఈ చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణ చేసిన ఒక ప్రత్యేకమైన అతిథి పాత్ర , ఆయనపై తెరకెక్కించిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ‘జుంబారే జుంజుంబారే’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణ తనదైన స్టైల్లో వేసిన మాస్ స్టెప్స్ అప్పట్లో థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. వైట్ డ్రెస్సులో, రెడ్ బ్యాండ్ వేసుకుని కృష్ణ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ డైరెక్టర్‌గా తానే స్వయంగా అందించిన ఈ పాట, విడుదలైన దశాబ్దాలు గడుస్తున్నా కూడా నేటికీ శ్రోతలను ఉత్సాహపరుస్తూనే ఉంది. ఒక స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన కృష్ణ, ఇటు కమెడియన్‌గా మారుతున్న అలీ చిత్రంలో ఇలాంటి మాస్ సాంగ్ చేయడం అప్పట్లో ఒక సంచలనం. ఈ పాటలో కృష్ణతో పాటు హీరోయిన్ కూడా తనదైన గ్లామర్ అండ్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ‘జుంబారే జుంజుంబారే’ పాట ట్యూన్ వినిపిస్తే ఎవరికైనా కాళ్లు ఆటోమేటిక్‌గా కదలాల్సిందే!
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..