Sunny Leone: బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టింది సన్నీ. ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆతర్వాత టాలీవుడ్ కు దూరమైంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆతర్వాత కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. తాజాగా మంచు విష్ణు నటిస్తున్న గాలి నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మంచు విష్ణు తన సొంత బ్యానర్లో ‘గాలి నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు.
ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. ఈ సినిమాలో రేణుక అనే ఎన్నారై పాత్రలో సన్నీలియోన్ కనిపించనుంది. మొన్న మధ్య సోషల్ మీడియా వేదిక సన్నీ ఈ సినిమాలో తన పాత్రను పరిచయం చేసింది. ఇక ఈ సినిమా కోసం సన్నీ 20 రోజుల డేట్స్ ఇచ్చారట. ఇందుకోసం ఈ అమ్మడికి భారీ పారితోషకం ఇస్తున్నారని తెలుస్తుంది. 20 రోజులకు గాను సన్నీకి రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. సన్నీకి ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు దాంతో ఈ సినిమాకు ఆమె ప్లెస్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :