టీవీషోలు, డ్యాన్స్ రియాలిటీషోలతో బుల్లితెరపై మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు మ్యాజిక్ షోలు, అదిరిపోయే స్టంట్లు చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. పలు కార్యక్రమాల్లో తన సింగింగ్ ట్యాలెంట్‌ను ప్రదర్శించిన అతను వెండితెరపై కూడా రాణించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘3 మంకీస్’ చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో కథానాయకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం సిద్ధమయ్యారు. ఆ సినిమా పేరే ‘గాలోడు’. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా పలు సినిమాల్లో నటించిన సుధీర్ ఈ చిత్రంలో తొలిసారిగా మాస్ లుక్‌లో కనిపించాడు. యాక్షన్ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు. కాగా ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పీ హీరోయిన్‌గా నటించనుంది. సప్తగిరి, పృథ్వీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దీంతో పాటు ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు సుధీర్.
Also Read:
Sabarimala: మళ్లీ తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ఈ షరతులు వర్తిస్తాయి..
Visakhapatnam: న్యూ ఇయర్ వేడుకల వేళ విశాఖలో అమలుకానున్న ఆంక్షలివే..