
బాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా మెరిసింది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించింది. కర్ణాటకలో జన్మించిన ఈ బ్యూటీ.. యాంకరింగ్ కూడా చేసి అభిమానులను సంపాదించుకుంది. వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని స్థిరపడింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఒక స్టార్ హీరోయిన్ భర్త ట్రోలర్స్‌కు ఇచ్చిన గట్టి కౌంటర్ బాలీవుడ్‌లో హాటెస్ట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆ దంపతులపై రూ. 60 కోట్ల మోసం కేసు నమోదైంది. దీపక్ కోఠారీ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు జూహు పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు రిజిస్టర్ అయింది.
ఈ నేపథ్యంలోనే ఆ హీరోయిన్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నేతృత్వంలో జరిగిన ఓ ‘ఆధ్యాత్మిక పాదయాత్ర’లో పాల్గొన్నారు. ఊర్వశీ రౌతేలా, రణబీర్ కపూర్, భావనా పాండే వంటి సెలబ్రిటీలతో కలిసి నడిచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగానే… ఆ స్టార్జోడీపై ట్రోలర్స్ దాడి మొదలైంది.
‘కేసులు ఉన్నోళ్లు ఇప్పుడు పాదయాత్రలు చేసి ఇమేజ్ క్లీన్ చేసుకుంటున్నారా?’ అంటూ కామెంట్ చేశారు కొందరు నెటిజన్లు. దీనికి ఆ హీరోయిన్ భర్త ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గట్టిగా స్పందించారు. ‘చీకట్లోనే బతకాలనుకునేవాళ్లు ఎప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ట్రోల్ చేస్తూ జీవితం గడపాలనుకునేవాళ్లు ఒకరోజు తెలుసుకుంటారు… ఆరోపణలు అంటే సత్యం కాదు. సనాతన ధర్మానికి నిలబడటం మీకు ఇబ్బంది కలిగిస్తే సమస్య మీలోనే ఉంది. చట్టం తన పని చేస్తుంది. స్క్రీన్‌షాట్‌లు తీసుకుని పోస్ట్‌లు పెట్టుకుంటూ జీవితం గడపండి!’ అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు.
People who live in the darkness of assumptions will always shout the loudest.
But here’s a simple truth allegations are not convictions, and headlines are not judgments. Some people seek peace in faith. Some seek noise in trolling. If standing for Sanatan, showing devotion, or… https://t.co/k3EFT9BQBR— Raj Kundra (@onlyrajkundra) November 20, 2025
శిల్పాశెట్టికి మద్దతుగా ఆమె భర్త రాజ్‌కుంద్రా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ‘ఆధ్యాత్మికత అంటే ఎవరికీ హాని చేయడం కాదు… దాన్ని కూడా ట్రోల్ చేయడం సిగ్గుచేటు’ అంటూ చాలామంది శిల్పాశెట్టి దంపతులకు మద్దతు తెలుపుతున్నారు.
Shilpa Shetty & Raj Kundra
2021లో అభిరామ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా తాజాగా మరో కేసులో చిక్కుకున్నారు. ఈ కేసులో శిల్పాశెట్టి పేరు కూడా ఉండటంతో నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సంఘటన బాలీవుడ్‌లో ఆధ్యాత్మికత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను చర్చకు తీసుకొచ్చింది. ట్రోలింగ్ పేరుతో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించవద్దని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.