Metro Bigg Boss: మెట్రో ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగిన బిగ్‌బాస్‌.. 54 స్టేషన్లలో..

|

Nov 13, 2021 | 7:22 PM

Metro Bigg Boss: బిగ్‌బాస్‌ రియాలిటీ షో 5వ ఎడిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక బిగ్‌బాస్‌ కేవలం వినోదాన్ని పంచే కార్యక్రమమే కాదని, ప్రజలకు అవగాహన పెంచేది కూడా అని నిర్వాహకులు నిరూపించారు...

Metro Bigg Boss: మెట్రో ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగిన బిగ్‌బాస్‌.. 54 స్టేషన్లలో..
Biggboss Metro
Follow us on

Metro Bigg Boss: బిగ్‌బాస్‌ రియాలిటీ షో 5వ ఎడిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక బిగ్‌బాస్‌ కేవలం వినోదాన్ని పంచే కార్యక్రమమే కాదని, ప్రజలకు అవగాహన పెంచేది కూడా అని నిర్వాహకులు నిరూపించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మెట్రో బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని తెర తీసింది. దీనిపై ఇప్పటికే ఎల్‌ అండ్ టీ ప్రతినిధులు హీరో, బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జునను కలిశారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా మెట్రోలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి పనులు చేయకూడదు అన్ని వివరాలతో కూడిన హోర్డింగ్స్‌ను మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేయనున్నారు.

‘బిగ్‌బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో మొదలు పెట్టిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్‌లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్‌ ఎంట్రన్స్‌తో పాటు స్టేషన్‌లోని కొన్ని ప్రదేశాల్లో హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 100 రోజులపాటు ఈ ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌ రియాలిటీ షో భావోద్వేగాలను తట్టిలేపే ఒక వినోదాత్మక కార్యక్రం. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా ప్రయాణికుల్లో భద్రతపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతుంది. స్టార్‌ మా, ఎల్‌ అండ్‌ టీ సంయుక్తంగా ఇలాంటి బాధ్యతాయుతమైన ప్రచారం కోసం కలిసి రావడం సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు ఈ విషయమై మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌ 3 కోసం 2019లో స్టార్‌ మాతో ఇలాంటి ఒప్పందాన్ని చేసుకున్నాం. ఇప్పుడు తాజా సీజన్‌లో కూడా ఈ ప్రచారాన్ని చేపట్టడం సంతోషాన్ని కలిగిస్తోంది. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఇలాగే మంచి ప్రజాదరణ పొందాలని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

Also Read: RBI Curbs: మరో బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు.. ఇక నుంచి ఈ బ్యాంకు నుంచి ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు..!

గుడ్డులోని పసుపు భాగం ఎంతమంది తింటున్నారు..! మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Aadhaar Update: మీ ఆధార్‌లో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ను ఎలా మార్చుకోవాలి.. పూర్తి వివరాలు