Viral Photo: ఫేస్ మాస్క్‏తో చిల్ అవుతున్న స్టార్.. ఎవరో గుర్తుపడితే మీరు గ్రేటే..

|

Mar 16, 2022 | 9:06 AM

ఫేస్‌మాస్క్‌ వేసుకుని చిల్‌ అవుతోన్న ఈ కమెడియన్‌కు అభిమానుల్లో క్రేజ్‌ భారీగానే ఉంది. అతని పేరు చెబితేనే తెలుగు సినీ ప్రేక్షకుల పెదాలపై నవ్వు వెల్లివిరుస్తుంది.

Viral Photo: ఫేస్ మాస్క్‏తో చిల్ అవుతున్న స్టార్.. ఎవరో గుర్తుపడితే మీరు గ్రేటే..
Actor
Follow us on

ఫేస్‌మాస్క్‌ వేసుకుని చిల్‌ అవుతోన్న ఈ కమెడియన్‌కు అభిమానుల్లో క్రేజ్‌ భారీగానే ఉంది. అతని పేరు చెబితేనే తెలుగు సినీ ప్రేక్షకుల పెదాలపై నవ్వు వెల్లివిరుస్తుంది. వెండితెర మీద విభిన్న పాత్రలతో మెరిపిస్తూ.. పలు సినిమాల్లో తన దైన కామెడీ పండిస్తున్నారు. రీల్‌ లైఫ్‌లోనే కాదు నిజజీవితంలోనూ అతను ఎంతో ఫన్నీగా ఉంటాడు. తోటివారిని నవ్విస్తుంటాడు. అన్నట్లు అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. నటుడిగానే రాణిస్తూ రైటర్‌గా అదృష్టం పరీక్షించుకున్నాడు. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. రీల్‌ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనూ ఫన్నీగా ఉంటూ వరు ఈ స్టార్‌ మరెవరో కాదు.. ప్రముఖ కమెడియన్‌ వెన్నెల కిశోర్‌ (Vennela Kishore) .

‘వెన్నెల’ సినిమాతో వెండితెరకు పరిచయమై దానినే ఇంటి పేరుగా మార్చుకున్నాడు వెన్నెల కిశోర్‌. తనదైన కామెడీ, పంచ్‌డైలాగులతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. యంగ్‌ హీరోలు, సీనియర్‌ నటుల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. నటుడిగా సత్తా చాటుతూనే వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌, జఫ్పా సినిమాలకు దర్శకత్వం వహించి ఆకట్టుకున్నారు. ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు, ఖిలాడీ చిత్రాల్లోనూ కడుపుబ్బా నవ్వించిన వెన్నెల కిశోర్‌.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో పాటు సర్కారువారి పాట, ఒకే ఒక జీవితం, భోళా శంకర్ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు.

Also Read:Viral Video: అబ్బ నాతో అంత ఈజీ కాదు..! గుర్రం దెబ్బకు పిల్లి విలవిల.. వీడియో వైరల్

News Watch: BJP డబుల్ ఇంజన్ కాదు.. ట్రబుల్ ఇంజన్… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్‌ బద్దలు