ఆ తెలుగు నటికి అరుదైన గౌరవం.. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆహ్వానం..

|

Aug 12, 2024 | 10:26 PM

ప్ర‌ఖ్యాత కూచిపూడి నృత్య‌కారిణి, తెలుగు న‌టి సంధ్యారాజుకు అరుదైన గౌర‌వం లభించింది. భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును కలిసే సదావకాశం వరించింది. 77వ స్వాతంత్య్రదినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వనంలో నిర్వ‌హించే `ఎట్ హోమ్‌`సెల‌బ్రేష‌న్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది.

ఆ తెలుగు నటికి అరుదైన గౌరవం.. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆహ్వానం..
Sandhya Raju
Follow us on

ప్ర‌ఖ్యాత కూచిపూడి నృత్య‌కారిణి, తెలుగు న‌టి సంధ్యారాజుకు అరుదైన గౌర‌వం లభించింది. భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును కలిసే సదావకాశం వరించింది. 77వ స్వాతంత్య్రదినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వనంలో నిర్వ‌హించే `ఎట్ హోమ్‌`సెల‌బ్రేష‌న్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది. తొలి చిత్రం `నాట్యం`తో రెండు జాతీయ పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న ఘ‌న‌త సంధ్యారాజుకు మాత్రమే సొంతం. సంధ్యారాజు త‌మిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపార‌వేత్త‌ పి.ఆర్‌.వెంక‌ట్రామ‌రాజా పుత్రిక. హైద‌రాబాద్‌లో నిశృంఖ‌ల డ్యాన్స్ అకాడమీ, నిశృంఖ‌ల ఫిల్మ్ ఫౌండ‌ర్‌గా అనేక కార్య‌క‌లాపాలు నిర్వహిస్తున్నారు. త‌న నృత్య క‌ళ‌తో ప్ర‌పంచానికి పరిచయమయ్యారు. ఆమె ప్ర‌తిభాపాటవాల‌ను ప్ర‌త్య‌క్ష నృత్య ప్ర‌సారాల్లో పాల్గొనడమే కాకుండా, చ‌ల‌న‌చిత్ర రంగంలోనూ త‌న‌దైన ముద్రవేసుకున్నారు.

న‌టిగా, క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్‌గా, జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్నారు. అలాగే కొరియోగ్రాఫ‌ర్‌గా, నిర్మాత‌గా.. భార‌తీయ సాంస్కృతిక రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు సంధ్యారాజు. ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్‎ని ఆగ‌స్టు 15 సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్రతి ఏటా సాంప్రదాయంగా నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 15న ఉద‌యం జెండా వంద‌నం పూర్త‌వ‌గానే సాయంత్రం ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్‌ని రాష్ట్ర‌ప‌తి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజ‌రైన అతిథుల‌తో ఆత్మీయంగా స‌మావేశ‌మ‌వుతారు. ఈ రిసెప్ష‌న్‌కి సీనియ‌ర్ రాజ‌కీయనాయ‌కులు, మిలిట‌రీ అధికారులు, ఇత‌ర‌ రంగాల్లో రాణిస్తున్న వ్య‌క్తులు హాజ‌ర‌వుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..