Soundarya: మోహన్​బాబు ఆ పని చేయకపోతే సౌందర్య చనిపోయేది కాదు! సంచలన కామెంట్లు చేసిన దర్శకుడు

తెలుగు తెరపై వెలుగులు నింపిన అపురూప సౌందర్యం, నటి సౌందర్య. 2004, ఏప్రిల్ 17న, కేవలం 32 ఏళ్ల వయసులో, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూయడం సినీ ప్రేక్షకులకు నేటికీ తీరని లోటు. ఈ దుర్ఘటనను ఇప్పటివరకు ..

Soundarya: మోహన్​బాబు ఆ పని చేయకపోతే సౌందర్య చనిపోయేది కాదు! సంచలన కామెంట్లు చేసిన దర్శకుడు
Mohanbabu And Soundarya

Updated on: Dec 05, 2025 | 8:57 AM

తెలుగు తెరపై వెలుగులు నింపిన అపురూప సౌందర్యం, నటి సౌందర్య. 2004, ఏప్రిల్ 17న, కేవలం 32 ఏళ్ల వయసులో, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూయడం సినీ ప్రేక్షకులకు నేటికీ తీరని లోటు. ఈ దుర్ఘటనను ఇప్పటివరకు విషాదకరమైన ఘటనగానే భావించారు. అయితే, తాజాగా దర్శకుడు రాజేంద్ర వెల్లడించిన కొన్ని కీలక విషయాలు నెట్టింట వైరల్​గా మారాయి. ఆరోజు మోహన్​బాబు ఎప్పటిలానే కఠినంగా ఉంటే సౌందర్య చనిపోయేది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఆ రోజు ఏం జరిగింది..

టాలీవుడ్​లో అప్పటి స్టార్​ హీరోలందరి సరసన నటించిన సౌందర్య తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్నారు. సౌందర్య తెలుగులో చివరగా `శివ శంకర్‌` అనే చిత్రంలో నటించారు. ఇందులో మోహన్‌ బాబు హీరో. దీనికి కాపుగంటి రాజేంద్ర దర్శకుడు.

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే సౌందర్య పర్మిషన్‌ తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. వెళ్లి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యింది. మోహన్‌ బాబు కారణంగానే సౌందర్య మనకు లేకుండా పోయిందని సంచలన కామెంట్‌ చేశారు దర్శకుడు రాజేంద్ర. ఆయన చేసిన మిస్టేక్‌ సౌందర్య కొంప ముంచిందన్నారు.

`శివ శంకర్‌` సినిమాకి నిర్మాత మోహన్‌ బాబు. ఆయన సౌందర్యకి పర్మిషన్‌ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఆమె మన ముందు బతికి ఉండేదని తెలిపారు. `షూటింగ్‌ సమయంలో నిర్మాత మోహన్‌బాబు ఎవరికీ సెలవిచ్చేవారు కాదు. ఎన్నికల ప్రచారం ఉండటంతో సౌందర్యకి మాత్రం సెలవిచ్చారు. ఒకవేళ ఆయన అనుమతి నిరాకరించి ఉంటే ఆమె బతికేవారేమో. సౌందర్య మరణం కారణంగా సినిమా సరిగా తీయక పరాజయం చెందింది` అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర. ఆయన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సౌందర్య మరణం ఆమె కుటుంబానికి, అభిమానులకు ఈ విషాదం ఎప్పటికీ తీరనిది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ఒక అసాధారణ వ్యక్తిత్వం. ఆమె జ్ఞాపకాలు సినీ ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి.