సోనూసూద్.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా విలన్‌గానే కనిపించిన ఈ ట్యాలెంటెడ్ యాక్టర్.. కరోనా సంక్షోభం (Corona Crisis)లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. వలస కార్మికులు, నిరుపేదలకు ఆపన్నహస్తం అందించి వారి పాలిట దేవుడిగా మారాడు. సహాయ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ట్విట్టర్‌లో అడిగిన వారందరికీ వీలైనంతవరకు సాయం చేశాడు. అయితే అప్పుడప్పుడు కొందరు నెటిజన్లు చిత్ర, విచిత్రమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు. వాటిని కూడా సానుకూలంగా తీసుకున్న సోనూసూద్ (Sonu Sood) తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ అభిమాని నుంచి ఈ రియల్ హీరోకు ఒక రిక్వెస్ట్ అందింది. ‘చలికాలంలో దుప్పట్లను పంచారు. అలాగే మండు వేసవిలో చల్లని బీరు అందిస్తే బాగుంటుంది’ అని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో సోనూకు మెసేజ్ పెట్టాడు. సోనూసూద్‌ను కూడా స్పందించాలని కోరాడు.
నెటిజన్ కోరినట్లే స్పందించిన రియల్ హీరో అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ‘బీర్‌తో పాటు స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది కదా’ అని రిప్లై ఇచ్చాడు. కాగా తన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇటీవలే దుబాయ్ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నాడు సోనూసూద్. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు పృథ్వీరాజ్, ఫతేహ్ (హిందీ), తమిళరసన్ (తమిళం) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇక బుల్లితెరపై రోడీస్ 18 సీజన్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహారిస్తున్నాడు.
बियर के साथ भुजिया चलेगा ? ? https://t.co/SX3rEtoYgL
— sonu sood (@SonuSood) April 6, 2022
Also Read: Chocolates: చిన్నా పెద్దా అందరూ మెచ్చే చాక్లెట్.. రుచిలోనే కాదు ఆరోగ్యంలోనూ అద్భుతమే
Buying House: రీసెల్ ప్రాపర్టీ కొనడం లాభదాయకమేనా? ఇలా నిర్ణయం తీసుకోండి..