మాల్దీవులకు పంపమన్న నెటిజన్‌.. సోనూ అదిరిపోయే రిప్లై

కరోనా లాక్‌డౌన్ వేళ సోనూసూద్‌ చేసిన సాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులకు ఆయన చేసిన సాయం వెలకట్టలేనిది.

మాల్దీవులకు పంపమన్న నెటిజన్‌.. సోనూ అదిరిపోయే రిప్లై

Edited By:

Updated on: Oct 31, 2020 | 12:29 PM

Sonu Sood reply: కరోనా లాక్‌డౌన్ వేళ సోనూసూద్‌ చేసిన సాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులకు ఆయన చేసిన సాయం వెలకట్టలేనిది. ఈ నేపథ్యంలో ఎంతోమంది ఆయనను దేవుడిగా భావిస్తున్నారు. ఇక ఐక్యరాజ్యసమితి సైతం ఆయన సేవలను గుర్తించి, ప్రత్యేక అవార్డును ఇచ్చింది. మరోవైపు సోనూ సాయంపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ.. ఆయన వాటిని పట్టించుకోవడం లేదు. వీలైతే మీరు సాయం చేయండి అంటూ విమర్శకులకు సూచిస్తున్న ఆయన.. ఇప్పటికీ తన సాయాన్ని కొనసాగిస్తున్నారు. (Corona Updates: దేశంలో 81లక్షలు దాటిన కేసుల సంఖ్య)

ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్‌ సోనూకు ఓ రిక్వెస్ట్ పెట్టాడు. సర్‌ నాకు మాల్దీవులకు వెళ్లాలని ఉంది. నాకు సాయం చేయండి అని పార్ద్‌ అనే ఓ నెటిజన్ సోనూకు ట్వీట్ చేశారు. దానికి స్పందించిన నటుడు.. మీకు సైకిల్‌ కావాలా..? రిక్షా కావాలా..? అని కామెంట్ పెట్టారు. ఇక ఈ ట్వీట్‌ని నెటిజన్లు సూపర్ రిప్లై సర్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. (IPL 2020: మరోసారి ‘బుట్ట బొమ్మ’కు వార్నర్ స్టెప్పులు )