AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Korean Actress Suicide: సౌత్ కొరియన్ యువ నటి ఆత్మహత్య .. స్వచ్చంద సేవా సంస్థ ద్వారా వికలాంగులకు అండగా నిలబడిన సాంగ్

గ్లామర్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన ఓ తార నేలరాలిపోయింది. వినోద రంగంలో అందరికీ వినోదం పంచి.. 26 ఏళ్లకే బలవంతంగా జీవిత రంగంనుంచి తప్పకుంది.. అటు తల్లిదండ్రులకు తీరని వేదనని.. అభిమానులకు కన్నీటిని మిగులుస్తూ...

South Korean Actress Suicide: సౌత్ కొరియన్ యువ నటి ఆత్మహత్య ..  స్వచ్చంద సేవా సంస్థ ద్వారా వికలాంగులకు అండగా నిలబడిన సాంగ్
Surya Kala
|

Updated on: Jan 28, 2021 | 4:21 PM

Share

South Korean Actress Suicide: గ్లామర్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన ఓ తార నేలరాలిపోయింది. వినోద రంగంలో అందరికీ వినోదం పంచి.. 26 ఏళ్లకే బలవంతంగా జీవిత రంగంనుంచి తప్పకుంది.. అటు తల్లిదండ్రులకు తీరని వేదనని.. అభిమానులకు కన్నీటిని మిగులుస్తూ ఆత్మహత్య చేసుకుంది దక్షిణ కొరియా నటి సాంగ్.

సియోల్‌లో 26 ఏళ్ల కొరియన్‌ నటి సాంగ్‌ యూ–జంగ్ ఆత్మహాత్య చేసుకుని తన నిండు నూరేళ్ళ జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది. తల్లిదండ్రులు సోమవారం కూతురి అంత్యక్రియలు జరిపించారు. సాంగ్‌కి .. సబ్‌లైమ్‌ ఆర్టిస్ట్‌ ఏజెన్సీ కి గల బేధాభిప్రాయాలు ఆత్మహత్యకు గల కారణాలు అనే టాక్ వినిపిస్తోంది.

సాంగ్ పందొమ్మిదేళ్లకే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. సాంగ్‌ ఎస్టీ లాండర్‌ స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులకు మోడలింగ్‌ చేసి.. అందరినీ ఆకట్టుకుంది. అనంతరం బాస్కిన్‌–రాబిన్స్‌ ఐస్‌ క్రీమ్‌ యాడ్ తో కొరియన్ దేశం మొత్తం సాంగ్ వైపు చూసేలా చేసుకుంది. చలాకీదనం, చురుకుదనంతో ఉండే సాంగ్ కు వరస ఆఫర్స్ వచ్చాయి. ఓ వైపు కే పాప్ సాంగ్స్ సింగర్ గా కొనసాగుతూనే మరో వైపు నటన వైఫు అడుగులు వేసింది. ఇరవై నాలుగేళ్లు వయసులో’డియర్‌ మై నేమ్‌’ అనే వెబ్‌ సీరీస్‌తో కొరియన్‌లకు నటిగా పరిచయమయ్యింది.

గోల్డెన్‌ రెయిన్‌బో, మేక్‌ యువర్‌ విష్, స్కూల్‌ 2017 అనే టీవీ సీరీస్‌లో నటించింది సాంగ్‌. తర్వాత వరస సినిమా ఆఫర్స్ అందుకుంది. ఈ లోపు కరోనా రావడంతో కెరీర్ కు బ్రేక్ పడింది. నిజానికి సాంగ్ నటి కాకపోయి ఉంటె కే పాప్ మహారాణిగా ఓ వెలుగు వెలిగి ఉండేది అని ఆమె సన్నిహితులు సాంగ్ మరణానికి కన్నీరు పెట్టుకుంటున్నారు. సాంగ్ ఎందరో వికలాంగులకు అండగా నిలబడింది. ‘వామ్‌ అకంపనిమెంట్‌’ అని దక్షిణ కొరియా ఒకపెద్ద సేవాసంస్థ కు రాయబారిగా పనిచేసేది సాంగ్. ఇప్పటి వరకూ ఆమె ద్వారా సహాయం పొందిన ఎందరో సాంగ్ మరణానికి కన్నీరు పెడుతున్నారు.

Also Read: వేలైంటెన్స్ డేన భగ్న ప్రేమికులకు జూ అధికారుల బంపర్ ఆఫర్.. మాజీల పేర్లు ఎలుకలు, బొద్దింకలకు పెట్టుకుని..

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే