Sidharth Malhotra And Kriti Sanon: బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో హస్సీతో ఫస్సీ, ఏక్ విలన్, బ్రదర్స్, కపూర్ అండ్ సన్స్, అయ్యారే సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గతేడాది సిద్ధార్థ్ నటించిన షేర్షా (Shershaah) చిత్రం కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ అభినయం అందరినీ ఆకట్టుకుంది. అన్నట్టు ఈ క్రేజీ హీరోకు అభిమానులు, ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. కాగా ఇప్పటివరకు తన నటనతో అందరి మనసులు గెల్చుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అతను చేసిన పనిపై ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
గౌను పట్టుకుని నిల్చుకుని..
సాధారణంగా అవార్డు ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లకు సినీ తారలు అందంగా ముస్తాబై వస్తారు. అలా తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ హోటల్‌లో ‘హలో! హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అందులో బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది తారలు పాల్గొన్నారు. అందులో సిద్ధార్థ్ తో పాటు బ్యూటీఫుల్ హీరోయిన్ కృతిసనన్ కూడా ఉన్నారు. ఎప్పటిలాగే ఎంతో అందమైన లావెండర్ గౌన్ వేసుకొని వచ్చింది కృతి. అక్కడ ఆమె స్టైల్‌కి, అందానికి ఫిదా అయిపోయారు. అయితే ఆ గౌను చాలా పొడవుగా ఉంది. దీంతో ఫొటోలకు స్టిల్స్ ఇస్తున్న సమయంలో గౌను అడ్డుపడంతో కృతి బాగా ఇబ్బంది పడింది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న సిద్ధార్థ్ ఆమె గౌనుని పట్టుకొని తనకి హెల్ప్ చేశాడు. కొద్దిసేపు అలాగే నిల్చున్నాడు. అతని సహాయంతో కెమెరాలకు వివిధ పోజుల్లో స్టిల్స్ ఇచ్చింది కృతి. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సిద్ధార్థ్ చేసిన పనిపై అభిమానులు, నెటిజన్లు అందులోనూ లేడీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సిల్వర్ స్ర్కీన్‌పై వీళ్లిద్దరినీ జంటగా చూడాలనుంది’, ‘ సిద్ధార్థ్ జెంటిల్ మేన్’, ‘సిద్ధార్థ్ లాంటి వ్యక్తి ఎక్కడ దొరకుతాడు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read:Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర! 2,3 రోజుల్లో టీఎస్ టెట్-2022 నోటిఫికేషన్ విడుదల..
Viral Video: ఇదేం పిచ్చి ఆనందం.. టాటూ క్రేజ్‌లో పడి యువతి చేసిన పనికి అంతా షాక్.. వీడియో
Wi-Fi Repeater: వైఫై రూటర్‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..